రజనీకి విలన్‌గా కమలహాసన్? | kamal hassan villain role in Rajinikanth movie | Sakshi
Sakshi News home page

రజనీకి విలన్‌గా కమలహాసన్?

Published Fri, Apr 17 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 AM

రజనీకి విలన్‌గా కమలహాసన్?

రజనీకి విలన్‌గా కమలహాసన్?

కోలీవుడ్‌లో ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే తాజా సమాచారం. అదే గనుక జరిగితే తమిళ తెరపైనే కాదు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పైనే వండర్ క్రియేట్ అవుతుంది. అంత బ్రహ్మాండమైన విషయం ఏమిటంటారా? తమిళ చిత్ర పరిశ్రమలో ధృవ నక్షత్రాలైన ఆ ఇద్దరినీ కలసి నటించే ప్రయత్నాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. ఆ దిగ్గజాలు విశ్వనాయకుడు కమలహాసన్, సూపర్‌స్టార్ రజనీకాంత్. వీరిని ఒకే చిత్రంలో హీరో, విలన్‌గా చూపే భగీరథ ప్రయత్నం జరుగుతోంది. వారిలో ఎవరు హీరో? ఎవరు విలన్ అని ఊహించగలరా? సకల కళా వల్లభుడు కమలహాసన్ హీరోగా నటిస్తే పెద్దగా విశేషం ఏముంటుంది.
 
  అందుకే ఆయన్ని ప్రతి నాయకుడిగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక సూపర్‌స్టార్ ఈ రోజుల్లో విలన్‌గా ఉంచలేం. ఎందిరన్‌లో నటించారుగా అంటారా? ఆ చిత్రంలో హీరో, విలన్ రెండూ ఆయనే. ఇంతకీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ప్రయత్నిస్తున్న సత్తా వున్నా దర్శకుడు శంకర్. కాస్త విపులంగా చెప్పాలంటే లింగా చిత్రం సృష్టించిన సమస్యలతో తలబొప్బి కట్టిన సూపర్‌స్టార్ తన కో చిత్రం చేయమని శంకర్‌ను కోరినట్లు సమాచారం. అందుకు అంగీకరించిన ఈ స్టార్ డెరైక్టర్ ఒక బ్రహ్మాండమైన కథను వినిపించారట. అది రజనీకి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందట.
 
 ఆ కథలో మరో సూపర్ విలన్ పాత్ర ఉంటుందట. ఆ పాత్రలో కమలహాసన్ నటిస్తే బాగుంటుందని శంకర్ ఆలోచన. ఈ మల్టీస్టారర్ చిత్రంలో నటించడానికి మొదట నో చెప్పిన కమల్ ఆ తరువాత ఆలోచించి చెబుతానని మాటిచ్చారట. ఒకవేళ కమల్ గనుక రజనీకి విలన్ అవ్వడానికి అంగీకరిస్తే ఆ చిత్రం ఒక సంచలనం అవుతుంది.  కమల్, రజనీ చివరిగా నినైత్తాల్ ఇనిక్కుమ్ చిత్రంలో కలసి నటించారు. ఆ చిత్రం తెరపైకి వచ్చి 36 ఏళ్లు అవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement