
శ్రోతలతో మాట్లాడుతున్న హీరో సుధీర్‌బాబు
హైదరాబాద్: మొదటిసారిగా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని సినీ హీరో సుధీర్‌బాబు వెల్లడించారు. హిందీలో తాను విలన్‌గా నటించిన భాగీ సినిమా విశేషాలను రేడియో సిటీ శ్రోతలతో ఆయన పంచుకున్నారు.
గురువారం ఆయన బంజారాహిల్స్‌లోని రేడియో సిటీలో శ్రోతలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. హిందీలో నటించడం కొత్త అనుభూతి అని చెప్పారు. టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో తనది విలక్షణమైన విలన్ పాత్ర అన్నారు. బాలీవుడ్‌లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.