Mega154 Movie Villain Is Malayalam Actor Biju Menon? - Sakshi
Sakshi News home page

Mega 152-chiranjeevi: చిరుతో తలపడనున్న గోపిచంద్‌ విలన్‌!

Published Mon, Jun 27 2022 2:59 PM | Last Updated on Mon, Jun 27 2022 5:09 PM

Mega 154: Malayalam Actor Biju Menon As Villain In Chiranjeevi, Bobby Movie - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉన్నాడు. ఇటీవల ఆచార్య సినిమాతో పలకరించిన చిరు ఆ వెంటనే భోళా శంకర్‌, గాడ్‌ ఫాదర్‌తో పాటు బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా లైన్లో పెట్టాడు. ఇటీవల గాడ్‌ ఫాదర్‌, బాబీ చిత్రాలు సెట్స్‌పైకి రాగా చిరు ఒకేసారి ఈ రెండు మూవీ షూటింగ్స్‌ల్లో పాల్గొంటున్నాడు చిరు. ఈ క్రమంలో మెగా 154 మూవీని సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తిక న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ప్రతికథానాయకుడి పాత్ర కోసం చిత్ర బృందం తమిళ హీరో విజయ్‌ సేతుపతి, నటుడు సముద్రఖనిలను అనుకుంటున్నట్లు ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పష్టత లేదు.

చదవండి: హార్ట్‌ సింబల్స్‌తో సమంత ట్వీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌..

ఈ క్రమంలో తాజాగా మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది.  విల‌న్ పాత్ర కోసం మలయాళ స్టార్‌ నటుడు బీజూమీన‌న్‌ను తీసుకోవాల‌ని చిత్ర‌బృందం భావిస్తుంద‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై స్ప‌ష్ట‌త రానుందని సమాచారం. ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌’తో బిజు మీన‌న్ పేరు ద‌క్షిణాదిన మారు మోగిపోయింది. కాగా బిజూ మీన‌న్ ‘ర‌ణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక చిరంజీవి ఈ చిత్రంలో అండ‌ర్‌క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నాడు. విశాఖ‌ప‌ట్నం నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మాస్‌రాజ ర‌వితేజ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement