Biju Menon
-
మెగా 154: చిరుకి విలన్‌గా ఆ మలయాళ స్టార్ నటుడు?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉన్నాడు. ఇటీవల ఆచార్య సినిమాతో పలకరించిన చిరు ఆ వెంటనే భోళా శంకర్, గాడ్ ఫాదర్‌తో పాటు బాబీ డైరెక్షన్లో ఓ సినిమా లైన్లో పెట్టాడు. ఇటీవల గాడ్ ఫాదర్, బాబీ చిత్రాలు సెట్స్‌పైకి రాగా చిరు ఒకేసారి ఈ రెండు మూవీ షూటింగ్స్ల్లో పాల్గొంటున్నాడు చిరు. ఈ క్రమంలో మెగా 154 మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తిక న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని ప్రతికథానాయకుడి పాత్ర కోసం చిత్ర బృందం తమిళ హీరో విజయ్ సేతుపతి, నటుడు సముద్రఖనిలను అనుకుంటున్నట్లు ఇప్పటి వరకు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పష్టత లేదు. చదవండి: హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. ఈ క్రమంలో తాజాగా మరో నటుడి పేరు తెరపైకి వచ్చింది. విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ నటుడు బీజూమీనన్ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తుందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని సమాచారం. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’తో బిజు మీనన్ పేరు దక్షిణాదిన మారు మోగిపోయింది. కాగా బిజూ మీనన్ ‘రణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక చిరంజీవి ఈ చిత్రంలో అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
సగం తమిళం సగం కన్నడం
తమిళసినిమా: నటి అంజలి సగం తమిళం, సగం కన్నడం అట. ఈ సగం సగం గొడవేమిటీ, అసలు అంజలి పదహారణాల తెలుగమ్మాయి కదా! అనేగా మీ ప్రశ్న. కట్రదు తమిళ్ చిత్రం ద్వారా తమిళ చిత్రరంగంలోకి ప్రవేశించిన ఈ తెలుగమ్మాయి, అంగాడితెరు, ఎంగేయుమ్ ఎప్పోదుమ్ వంటి చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. అదే విధంగా తెలుగులోనూ కథానాయకిగా మంచి పేరు సంపాదించుకున్న అంజలి మలయాళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే ఒక చిత్రం ద్వారా మాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన అంజలి తాజాగా మరో అవకాశాన్ని అందుకున్నారు. ఈ సారి జనరంజకమైన పాత్రలో అలరించడానికి సిద్ధం అయ్యారు. ఇండియన్ హాస్యభరిత కథా చిత్రాలలో మలయాళ చిత్రాలలో కామెడీ సహజత్వంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాంటి వినోదాత్మక కథా చిత్రంగా రోసాపూ అనే చిత్రం రూపొందుతోంది. వినూ జోసప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బిజూ మీనన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటించిన మూడు చిత్రాలు 100 రోజులు ప్రదర్శింపబడ్డాయన్నది గమనార్హం. ఈ రోసాపూ చిత్రంలో ఆయనతో పాటు నీరజ్ యాదవ్, శోభన్ షభీర్, దీలీప్పోతన్, అంజలి, శిల్పా మంజునాథ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 23వ తేదీన ప్రారంభమైంది. చిత్రంలో నటి అంజలిని ఎంపిక చేయడం గురించి దర్శకుడు వివరిస్తూ, రోసాపూ చిత్రంలో కథానాయకి సగం తమిళం, సగం కన్నడం భాషలు తెలిసిన అమ్మాయి అని తెలిపారు. ఈ పాత్రకు నటి అంజలి అయితే బాగుంటుందపి ఆమెను ఎంపిక చేశామన్నారు. ఈ పాత్ర చాలా వినోదభరితంగా ఉంటూ కథానాయకునికి పక్కా బలాన్నిచ్చేదిగా ఉంటుందని చెప్పారు. ఇది అంజలి కేరీర్లో ఒక మకుటంగా నిలిచిపోతుందని అన్నారు. కాగా ఇప్పుడు మలయాళం చిత్రాలు కోలీవుడ్, టాలీవుడ్‌ల్లోనూ అనువాదం అవుతున్నాయి కా బట్టి ఈ రోసాపూ చిత్రాన్ని తమిళం, తెలుగు ప్రేక్షకులు చూసే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. -
సెప్టెంబర్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు అక్షయ్ కుమార్ (నటుడు), బిజు మీనన్ (నటుడు) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడైన శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం నిరుద్యోగులకు, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడం, రాజకీయ నాయకులకు పదవీ యోగం పట్టడం వంటి శుభపరిణామాలు సంభవిస్తాయి. ఈ సంవత్సరం కష్టపడి సాధించుకున్నది జీవితాంతం అనుభవించే అవకాశం ఉంటుంది. భూ, గృహ యోగాలు సిద్ధిస్తాయి. అధికారుల సాయం లభిస్తుంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఈ సంవత్సరం వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడం మంచిది. అయితే మధ్యవర్తిత్వాలు, సాక్షి సంతకాలు, హామీ ఉండటాలు విరమించుకోవాలి. ఈ రోజు పుట్టిన తేదీ 9. ఇది కుజుని సంఖ్య కాబట్టి వీరికి ధైర్యం, సహనం, కొత్త ఆలోచనలు, సమాజం పట్ల అంకిత భావం వంటి లక్షణాలుంటాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. అయితే కోర్టుకేసులు, న్యాయసంబంధమైన వివాదాలు ఉన్న వారు సంయమనం పాటించాలి. దూకుడు తగ్గించుకోవాలి. ఆయుధాల వాడకంలోనూ, వాహనాలను నడపడంలోనూ అప్రమత్తత అవసరం. లక్కీ నంబర్స్: 2,5,8,9; లక్కీ డేస్: సోమ, బుధ, గురు, శనివారాలు; లక్కీ కలర్స్: బ్లూ, రోజ్, ఆరంజ్. రెడ్, పింక్. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శనికి అభిషేకం చేయించుకోవడం, ఆవులకు, కోతులకు ఆహారం తినిపించడం, రక్తదానం చేయడం లేదా రక్తదానం చేయడాన్ని ప్రోత్సహించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్