సెప్టెంబర్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
అక్షయ్ కుమార్ (నటుడు), బిజు మీనన్ (నటుడు)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 8. ఇది వృత్తికారకుడైన శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం నిరుద్యోగులకు, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారికి చాలా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడం, రాజకీయ నాయకులకు పదవీ యోగం పట్టడం వంటి శుభపరిణామాలు సంభవిస్తాయి. ఈ సంవత్సరం కష్టపడి సాధించుకున్నది జీవితాంతం అనుభవించే అవకాశం ఉంటుంది. భూ, గృహ యోగాలు సిద్ధిస్తాయి. అధికారుల సాయం లభిస్తుంది. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఈ సంవత్సరం వారి అదృష్టాన్ని పరీక్షించుకోవడం మంచిది. అయితే మధ్యవర్తిత్వాలు, సాక్షి సంతకాలు, హామీ ఉండటాలు విరమించుకోవాలి. ఈ రోజు పుట్టిన తేదీ 9. ఇది కుజుని సంఖ్య కాబట్టి వీరికి ధైర్యం, సహనం, కొత్త ఆలోచనలు, సమాజం పట్ల అంకిత భావం వంటి లక్షణాలుంటాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది.
అయితే కోర్టుకేసులు, న్యాయసంబంధమైన వివాదాలు ఉన్న వారు సంయమనం పాటించాలి. దూకుడు తగ్గించుకోవాలి. ఆయుధాల వాడకంలోనూ, వాహనాలను నడపడంలోనూ అప్రమత్తత అవసరం. లక్కీ నంబర్స్: 2,5,8,9; లక్కీ డేస్: సోమ, బుధ, గురు, శనివారాలు; లక్కీ కలర్స్: బ్లూ, రోజ్, ఆరంజ్. రెడ్, పింక్.
సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, శనికి అభిషేకం చేయించుకోవడం, ఆవులకు, కోతులకు ఆహారం తినిపించడం, రక్తదానం చేయడం లేదా రక్తదానం చేయడాన్ని ప్రోత్సహించడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్