హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’. వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం టబును సంప్రదించారు. కథ నచ్చడంతో టబు కూడా ఓకే అన్నారు.
ఇక 2000లో విడుదలైన హిందీ చిత్రం ‘హేరా ఫేరి’ తర్వాత హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ టబు, దర్శకుడు ప్రియదర్శన్‌లు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అంటే... పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్‌లో సినిమా కుదిరిందన్న మాట. ‘భూత్ బంగ్లా’ సినిమాను 2026 ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment