Bhoot Bungalow
-
భూత్ బంగ్లాలో టబు
హీరో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘భూత్ బంగ్లా’. వామికా గబ్బి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రానీ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం టబును సంప్రదించారు. కథ నచ్చడంతో టబు కూడా ఓకే అన్నారు. ఇక 2000లో విడుదలైన హిందీ చిత్రం ‘హేరా ఫేరి’ తర్వాత హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ టబు, దర్శకుడు ప్రియదర్శన్‌లు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అంటే... పదమూడు సంవత్సరాల తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్లో సినిమా కుదిరిందన్న మాట. ‘భూత్ బంగ్లా’ సినిమాను 2026 ఏప్రిల్ 2న విడుదల చేయాలని అనుకుంటున్నారు. -
భూత్ బంగ్లా.. ఫర్ సేల్!
రాజసం ఉట్టిపడే భవంతి.. పక్కనే సరస్సు.. ఓహ్! సెట్టింగ్ అదిరిపోయింది. ఇటలీలోని వెనిస్ నగరం వద్ద ఉన్న ఓ చిన్న ద్వీపంలో ఉంటుందీ భవనం. పేరు పొవీగ్లియా! వచ్చే నెలలో దీన్ని వేలం వేయబోతున్నారు. పాపం.. దీని యజమాని ఆర్థికంగా దెబ్బతిన్నాడేమో అనుకునేరు. కారణమది కాదు. ఇటలీ ప్రభుత్వ అధీనంలోని ఈ భవంతికి ప్రపంచంలోనే అతి భయంకరమైన భూత్ బంగళాగా పేరుంది. ఎప్పుడో 1793లో ప్లేగు బాధితుల చికిత్స కోసం ఈ భవంతిని వాడటంతో ఈ సమస్య మొదలైందట. 1922లో దీని రూపురేఖలు కొంచెం మార్చి మానసిక వికలాంగుల ఆస్పత్రిగా మార్చి చూశారు. ఊహూ.. ఫలితం కనిపించలేదు. భూతాల ప్రభావంతో ఓ డాక్టర్‌కు పిచ్చెక్కిపోయి రోగులపై చిత్రవిచిత్రమైన శస్త్ర చికిత్సలు చేస్తున్నాడన్న పుకారు పుట్టింది. దీంతో ఇటలీ ప్రభుత్వం దాదాపు 50 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉన్న ఈ భవంతిని, దీవితో సహా అమ్మేయాలని లేదా 99 ఏళ్ల లీజుకైనా ఇచ్చేయాలని ప్రయత్నిస్తోంది. భూతాలూ, దెయ్యాలూ అంతా ట్రాష్ అని మీరు గట్టిగా నమ్మేవారైతే.. దీనిని కొనేందుకు.. ట్రై చేసి చూడండి!