భూత్ బంగ్లా.. ఫర్ సేల్! | Bhoot Bangla .. for sale! | Sakshi
Sakshi News home page

భూత్ బంగ్లా.. ఫర్ సేల్!

Published Thu, Apr 17 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

భూత్ బంగ్లా.. ఫర్ సేల్!

భూత్ బంగ్లా.. ఫర్ సేల్!

రాజసం ఉట్టిపడే భవంతి.. పక్కనే సరస్సు.. ఓహ్! సెట్టింగ్ అదిరిపోయింది. ఇటలీలోని వెనిస్ నగరం వద్ద ఉన్న ఓ చిన్న ద్వీపంలో ఉంటుందీ భవనం. పేరు పొవీగ్లియా! వచ్చే నెలలో దీన్ని వేలం వేయబోతున్నారు. పాపం.. దీని యజమాని ఆర్థికంగా దెబ్బతిన్నాడేమో అనుకునేరు. కారణమది కాదు. ఇటలీ ప్రభుత్వ అధీనంలోని ఈ భవంతికి ప్రపంచంలోనే అతి భయంకరమైన భూత్ బంగళాగా పేరుంది. ఎప్పుడో 1793లో ప్లేగు బాధితుల చికిత్స కోసం ఈ భవంతిని వాడటంతో ఈ సమస్య మొదలైందట.

1922లో దీని రూపురేఖలు కొంచెం మార్చి మానసిక వికలాంగుల ఆస్పత్రిగా మార్చి చూశారు. ఊహూ.. ఫలితం కనిపించలేదు. భూతాల ప్రభావంతో ఓ డాక్టర్‌కు పిచ్చెక్కిపోయి రోగులపై చిత్రవిచిత్రమైన శస్త్ర చికిత్సలు చేస్తున్నాడన్న పుకారు పుట్టింది. దీంతో ఇటలీ ప్రభుత్వం దాదాపు 50 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉన్న ఈ భవంతిని, దీవితో సహా అమ్మేయాలని లేదా 99 ఏళ్ల లీజుకైనా ఇచ్చేయాలని ప్రయత్నిస్తోంది. భూతాలూ, దెయ్యాలూ అంతా ట్రాష్ అని మీరు గట్టిగా నమ్మేవారైతే.. దీనిని కొనేందుకు.. ట్రై చేసి చూడండి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement