ఇంటి ధర కేవలం రూ.85.. కానీ దాని రెనొవేషన్‌కు మాత్రం ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు అయింది.. ‘అదేంటి.. రూ.85కే ఇళ్లు ఎక్కడ దొరుకుతుంది. అద్దె ఇళ్లే దాదాపు రూ.15,000 వరకు ఉంది. మరి అంత తక్కువకు ఇళ్లు ఎవరిస్తారు?’ అని అనుకుంటున్నారా. అలా అయితే మనం ఇటలీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలసుకోవాల్సిందే.
ఇటలీలోని సాంబుకా డి సిసిలియాలో 2019లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లను వేలం వేశారు. అలా చాలా ఏళ్లుగా ఉపయోగంలోలేని ఓ ఇంటిని చికాగోకు చెందిన ఆర్థిక సలహాదారు మెరెడిత్ టాబోన్ కొనుగోలు చేశారు. కేవలం 1.05 డాలర్లు(రూ.85)కే దాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఆ ఇంటిని 17 శతాబ్దంలో నిర్మించినట్లు తెలిసింది. దానికి కరెంట్, నీటి సౌకర్యం లేదు. వేలం పూర్తయిన తర్వాతే తాను ఆ ఇంటిని చూశారు. సాంబుకా డి సిసిలియా ప్రాంత్రంలో ఓ మూలన ఉన్న ఆ ఇంటిని మొదటగా చూసి మెరెడిత్ దాన్ని పునరుద్ధరణ చేయించాలనుకున్నారు. దాంతో గడిచిన నాలుగేళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అందుకు 4,46,000(దాదాపు రూ.3.8 కోట్లు) ఖర్చు అయినట్లు ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్‌పీఐలు
మెరెడిత్ టాబోన్ ఇంత ఖర్చు చేసి ఎందుకు దీన్ని పునరుద్ధరించారని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ‘1908లో నా కుంటుంబం యూఎస్‌కు వెళ్లడానికి ముందు మా ముత్తాత ఈ ప్రాంతంలోనే ఉండేవారు. తన జ్ఞాపకాలకు గుర్తుగా దీన్ని ఎంచుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు. ఇంటికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఇంట్లో ప్రత్యేకంగా డిజైనింగ్, టైల్స్, ఇంటీరియర్.. వంటి వాటికి భారీగా ఖర్చవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టేందుకు అయ్యే ఖర్చు ఒకెత్తైతే, మన అభిరుచులకు తగినట్లుగా ఇంటీరియర్ డిజైన్ చేయించేందుకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment