Buying a home
-
ఇంటి ధర రూ.85! రెనొవేషన్కు రూ.3.8 కోట్లు!!
ఇంటి ధర కేవలం రూ.85.. కానీ దాని రెనొవేషన్కు మాత్రం ఏకంగా రూ.3.8 కోట్లు ఖర్చు అయింది.. ‘అదేంటి.. రూ.85కే ఇళ్లు ఎక్కడ దొరుకుతుంది. అద్దె ఇళ్లే దాదాపు రూ.15,000 వరకు ఉంది. మరి అంత తక్కువకు ఇళ్లు ఎవరిస్తారు?’ అని అనుకుంటున్నారా. అలా అయితే మనం ఇటలీలో జరిగిన ఈ సంఘటన గురించి తెలసుకోవాల్సిందే.ఇటలీలోని సాంబుకా డి సిసిలియాలో 2019లో నిరుపయోగంగా ఉన్న ఇళ్లను వేలం వేశారు. అలా చాలా ఏళ్లుగా ఉపయోగంలోలేని ఓ ఇంటిని చికాగోకు చెందిన ఆర్థిక సలహాదారు మెరెడిత్ టాబోన్ కొనుగోలు చేశారు. కేవలం 1.05 డాలర్లు(రూ.85)కే దాన్ని వేలంలో దక్కించుకున్నారు. ఆ ఇంటిని 17 శతాబ్దంలో నిర్మించినట్లు తెలిసింది. దానికి కరెంట్, నీటి సౌకర్యం లేదు. వేలం పూర్తయిన తర్వాతే తాను ఆ ఇంటిని చూశారు. సాంబుకా డి సిసిలియా ప్రాంత్రంలో ఓ మూలన ఉన్న ఆ ఇంటిని మొదటగా చూసి మెరెడిత్ దాన్ని పునరుద్ధరణ చేయించాలనుకున్నారు. దాంతో గడిచిన నాలుగేళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అందుకు 4,46,000(దాదాపు రూ.3.8 కోట్లు) ఖర్చు అయినట్లు ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Meredith Tabbone (@meredith.tabbone)ఇదీ చదవండి: మళ్లీ డబ్బు పెడుతున్న ఎఫ్పీఐలుమెరెడిత్ టాబోన్ ఇంత ఖర్చు చేసి ఎందుకు దీన్ని పునరుద్ధరించారని ఓ మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ‘1908లో నా కుంటుంబం యూఎస్‌కు వెళ్లడానికి ముందు మా ముత్తాత ఈ ప్రాంతంలోనే ఉండేవారు. తన జ్ఞాపకాలకు గుర్తుగా దీన్ని ఎంచుకున్నాను’ అని సమాధానం ఇచ్చారు. ఇంటికి సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఇంట్లో ప్రత్యేకంగా డిజైనింగ్, టైల్స్, ఇంటీరియర్.. వంటి వాటికి భారీగా ఖర్చవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో ఇల్లు కట్టేందుకు అయ్యే ఖర్చు ఒకెత్తైతే, మన అభిరుచులకు తగినట్లుగా ఇంటీరియర్ డిజైన్ చేయించేందుకు అయ్యే ఖర్చు తడిసిమోపెడవుతుంది. -
ఇంటి డెసిషన్.. ఇంత ఫాస్టా?
ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు... ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే డెసిషన్ తీసుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ప్రాపర్టీ అన్వేషకులు కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయంపై ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.వేగానికి కారణమిదే... ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల విక్రయాలు పెరిగాయి. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.రూ.3 కోట్లయినా చిటికెలో నిర్ణయం.. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువగా, కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.1–3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు ఏకంగా 30 రోజులు సమయం తీసుకుంటున్నారు.డిమాండ్‌తో వేగంగా నిర్ణయం కోవిడ్ తర్వాతి నుంచి విశాలైన గృహాలు, హైఎండ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ఇళ్లు వేగంగా అమ్ముడవుతున్న కారణంగా కస్టమర్లు కొనుగోలు నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటున్నారు. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
నెలవారీ సంపాదనలో పొదుపు.. ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా?
నెలవారీ సంపాదనలో పొదుపు చేసిన మొత్తాన్ని.. రిటైర్మెంట్, పిల్లల విద్య, ఇల్లు కొనుగోలు తదితర లక్ష్యాలకు ఎలా కేటాయించుకోవాలి? ఇందుకు ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా? – వికాస్ సింగ్మీ ఆదాయం, ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా వివిధ లక్ష్యాల కోసం పొదుపు, పెట్టుబడులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎలా విభజించాలనే దానికి సార్వత్రిక సూత్రం అంటూ లేదు. వ్యక్తుల ఆదాయ పరిస్థితులు, రాబడుల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగానే నిర్ణయించుకోవాలి.మీ ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి. దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవి అద్భుతమైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3–5 ఏళ్ల స్వల్ప కాలానికి సంబంధించిన లక్ష్యాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.ఇక క్రమం తప్పకుండా అంటే ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా మీ పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను డెట్ సాధనాల వైపు మళ్లించుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే చురుకైన ప్రణాళికను ఆచరణలో పెట్టండి. నా వద్ద 2020లో కొనుగోలు చేసిన డెట్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని విక్రయిస్తే పన్ను భారం ఎలా పడుతుంది? – పి.కె గుప్తాస్థిరమైన రాబడులకు డెట్ ఫండ్స్ మంచి ఎంపిక. మీరు 2020లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసి, ఇప్పుడు విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. పైగా లాభంలో ద్రవ్యోల్బణం ప్రభావం తీసివేసేందుకు (ఇండెక్సేషన్) అవకాశం లేదు. డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన తేదీ, ఎంత కాలం పాటు కొనసాగించారు, ఎప్పుడు విక్రయించారనే ఆధారంగా పన్ను భారం మారిపోతుంది.2023 ఏప్రిల్ 1కి ముందు డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే 36 నెలల పాటు వాటిని కొనసాగించి, 2024 జూలై 23లోపు విక్రయించిన వారికే ఈ ప్రయోజనం పరిమితం. మీ కొనుగోలు ధరలో ఇండెక్సేషన్ సర్దుబాటు జరుగుతుంది. దీంతో లాభంపై చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గిపోతుంది. కాకపోతే 2023 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసినప్పటికీ, 2024 జూలై 23లోపు విక్రయించని వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం కోల్పోయినట్టే.దీంతో గతంతో పోల్చితే డెట్ ఫండ్స్ లాభాలపై ప్రస్తుత పన్ను ఆకర్షణీయంగా లేదు. కాకపోతే మరింత కాలం పాటు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారా సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్డీలపై వడ్డీ ఏటా పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో విక్రయించినప్పుడే లాభంపై పన్ను అమల్లోకి వస్తుంది. -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
Q & A: ఇల్లు కొందామనుకుంటున్నా.. డౌన్‌పేమెంట్ కోసం ఈక్విటీ ఫండ్స్ కరెక్టేనా?
నేను వచ్చే 15 ఏళ్లలో రూ.2.5–3 కోట్ల వరకు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. డౌన్‌పేమెంట్ సమకూర్చుకునేందుకు... టాటా స్మాల్‌క్యాప్ లేదంటే ఎడెల్వీజ్ స్మాల్‌క్యాప్, మిరే అస్సెట్ మిడ్‌క్యాప్ లేదా పీజీఐఎం ఇండియా మిడ్‌క్యాప్ అన్నవి మంచి ఎంపికలేనా? – ఆదిత్య బి మీరు ఇప్పటి నుంచి 10–15 ఏళ్లలో ఇల్లు కొనుగోలు చేయాలనే ప్రణాళికతో ఉంటే సరైన ట్రాక్‌లో ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే మీ పెట్టుబడులు వృద్ధి చెందేందుకు తగినంత వ్యవధి ఉంది. ఈక్విటీ ఫండ్స్‌లో మోస్తరు రాబడులకు ఇంతకాలం అనుకూలమని చెప్పుకోవచ్చు. దీంతో మీ ఇంటి కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇంటి కొనుగోలుకు అయ్యే ధరను ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అంచనా వేస్తునట్టు అయితే, దీనికి రియల్ ఎస్టేట్‌లో ఉండే సగటు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని జోడించాల్సి ఉంటుంది. అప్పుడు వాస్తవ కొనుగోలు ధరపై అంచనాకు రావాలి. దీనివల్ల డౌన్ పేమెంట్ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు నెలవారీగా ఎంత మేర సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలన్న దానిపై స్ప ష్టత సాధించొచ్చు. సిప్ మొత్తాన్ని రెండు నుంచి మూడు ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకటి రెండు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పథకాలను కూడా జోడించుకోవచ్చు. కాకపోతే వీటిల్లో 25–30 శాతానికి మించి కేటాయింపులు చేసుకోవద్దు. మీ రిస్క్ సామర్థ్యం, ఈక్విటీ ఫండ్స్ పట్ల మీకు ఉన్న గత అనుభవం ఆధారంగా కేటాయింపులపై నిర్ణయానికి రావాలి. గృహ రుణానికి చెల్లించే ఈఎంఐ మీ నెలవారీ ఆదాయంలో మూడింట ఒక వంతు మించకుండా చూసుకోండి. ఇందుకు గాను కావల్సినంత డౌన్ పేమెంట్‌ను ముందే సమకూర్చుకోవాలి. మరోవైపు ఇంటిని పెట్టుబడిగా చూడడం మంచి ఆలోచన కాదు. రియల్ ఎస్టేట్‌లో లిక్విడిటీ చాలా తక్కువ. ఇంటిని కొనుగోలు చేయడం, విక్రయించడం అంత సులభం కాదు. కనుక ఇంటి కొనుగోలు నివాసం కోణం నుంచే చూడాలి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సొంతిల్లు ఏ వయసుకు సమకూర్చుకోవాలి..?
మా చిన్నారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిద్దామన్నది నా భవిష్యత్తు ఆలోచన. రూపాయి మారకం విలువను హెడ్జ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? పెట్టుబడుల కాలవ్యవధి 21 ఏళ్లు. – ప్రవీణ్ షా ఐదు, పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ నుంచి చూస్తే ఇప్పటికి చాలా వరకు క్షీణించినట్టు గుర్తించొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్దగా మారిందేమీ లేదు. వడ్డీ రేట్ల పరంగా అంతరం ఉంటున్నందున రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ చి న్నారి విదేశీ విద్య కోసం పొదుపు చేద్దామనుకుంటే అందుకు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. సామర్థ్యం, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చే పథకంలోనే ఇన్వెస్ట్ చేసుకో వాలి. మరింత మెరుగైన రాబడులను ఇచ్చే దేశీ మ్యూ చువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మొత్తం సమకూరొచ్చు. కనుక మెరుగైన రాబడులను ఇవ్వలేని విదేశీ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక అంతర్జాతీయ ఫండ్ ఎంపిక కీలకమని తెలుసుకోవాలి. నా వయసు 22 సంవత్సరాలు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఏ వయసుకు సొంతిల్లు సమకూర్చుకోవాలి? – రషీద్ సొంతిల్లు విషయంలో అందరికీ సరిపోయే ఏకైక ప్రామాణిక పరిష్కారం ఉందని అనుకోవడం లేదు. కాకపోతే ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఇవి సరైన నిర్ణయం తీసుకునేందుకు సాయపడతాయి. చాలా మందికి సొంతిల్లు ఆర్థికంగా అతిపెద్ద ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. ఇంటి రుణం పేరుతో అతిపెద్ద ఆర్థిక బాధ్యత వచ్చి పడుతుంది. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చొప్పున (ఈఎంఐ) చాలా ఏళ్లపాటు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆర్థికంగా ఏ మేరకు స్థిరపడ్డామన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలి. తమ ఉద్యోగం లేదా వృత్తి జీవితంలో స్థిరత్వం గురించి స్పష్టతకు రావాలి. అప్పుడే తన ఆదాయంపై అంచనాకు రావచ్చు. వృత్తిపరంగా స్థిరత్వాన్ని సాధించారా? లేదంటే వచ్చే రెండు మూడేళ్లలో ఆ స్థాయికి చేరుకుంటామని భావిస్తున్నారా? ఈ విషయంలో స్పష్టత అవసరం. రెండో అంశం.. ఈఎంఐ కట్టాలన్న లక్ష్యంతో వ్యయాలను పూర్తిస్థాయిలో తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ ఆదాయంలో ఈఎంఐ మూడింట ఒక వంతును మించకపోవడం సహేతుకమైనది. అప్పుడే ఇతర వ్యయాలను ఎదుర్కోవడానికి మీకు వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు, ఇతర జీవిత లక్ష్యాలకూ కొంత ఆదా చేసుకోగలరు. నెలవారీ వేతనంలో ఈఎంఐ పరిమాణం ఎంతన్నది ముఖ్యమైనది. మీకున్న రుణ పరపతి ఏ మేరకు, బ్యాంక్ బ్యాలన్స్ ఏ మేరకు? అన్న అంశాలను రుణమిచ్చే సంస్థలు చూస్తాయి. వీటి ఆధారంగా రుణ రేటును నిర్ణయిస్తాయి. రుణ పరపతి మెరుగ్గా ఉంటే, ఆకర్షణీయమైన రేటుకే గృహ రుణం అందుకోవచ్చు. ఇక ఇంటిని కొనుగోలు చేయడం అన్నది ఒక్క ఆర్థికపరమైన నిర్ణయమే కాదు. ఇందులో జీవిత భాగస్వామి ప్రాధాన్యాన్ని చాలా మంది పరిగణనలోకి తీసుకుంటారు. కనుక దంపతులు ఇద్దరూ కలసి తమ జీవిత లక్ష్యాలు, ఎక్కడ స్థిరపడాలి, ఎటువంటి ఇల్లు కొనుగోలు చేయాలన్న అంశాలను నిర్ణయించుకోవాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు!
సంతలో కూరగాయలు కొనేటప్పుడు పుచ్చులేమైనా ఉన్నాయా అని గమనిస్తాం. దుస్తులు షాపింగ్ చేసేముందు ట్రయల్ చేశాకే కొంటాం. బైక్, కారు కొనాలంటే మైలేజ్, వేగం, ధర వంటి అన్ని విషయాలు తెలుసుకున్నాకే తీసుకుంటాం. ..పదులు, వందలు, వేల రూపాయల ధర ఉండే వీటినే ఒకటి రెండు సార్లు ఆరా తీశాకే కొనుగోలు చేస్తాం. మరి, అలాంటిది జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలు విషయంలో తొందరెందుకు? ధరలు పెరుగుతున్నాయనో, ఆఫర్ మళ్లీ రాదనో, డిమాండ్ ఉందని తర్వాత బిల్డర్ రేటు ఎక్కువ చెబుతాడనో కంగారు పడొద్దు. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్‌లో ఉంది. దీంతో గత నాలుగు నెలలుగా ప్రాపర్టీ విక్రయాలు 40–50 శాతం మేర తగ్గాయి. డిసెంబర్ వరకూ మార్కెట్ స్తబ్దుగానే కొనసాగుతుంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే జనవరి తర్వాత నగర స్థిరాస్తి రంగం పరుగులు పెట్టడం ఖాయం. లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పడి స్థిరపడే 4–5 నెలల వరకు స్తబ్ధ్దత కొనసాగుతుంది. ఆ తర్వాత పుంజుకుంటుంది. నగరంలో గత 3–4 ఏళ్లుగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఉన్న రేట్లతో పోలిస్తే కొనుగోలుదారులు జనవరి నుంచి 20–30 శాతం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే! ఔటర్ నుంచి 2 కి.మీ.లోపు.. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కనెక్టివిటీ కారణంగా నగరం నలువైపులా ప్రయాణం సులువైపోయింది. దీంతో కొనుగోలుదారులు ఓఆర్ఆర్ నుంచి 2 కి.మీ. పరిధిలో ప్రాపరీ్టలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా చ.అ.కు రూ.5–6 వేల మధ్య దొరకుతున్నాయి. వసతుల విషయంలో బిల్డర్లు రాజీపడటం లేదు. వెస్ట్‌తో పోలిస్తే 30–35 శాతం తక్కువ ధరకు ప్రాపర్టీలు దొరుకుతాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్లో విల్లాలు దొరుకుతాయి. అప్రిసియేషన్ కూడా వేగంగా ఉంటుంది. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, దుండిగల్, అన్నోజిగూడ, కొంపల్లి, బహదూర్‌పల్లి వంటి ప్రాంతాలలో ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. పశ్చిమ హైదరాబాద్‌లో చ.అ. 8–10 వేల మధ్య ఉన్నాయి. వసతులు, పన్నులు కలిపితే 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఎంతలేదన్నా రూ.1.20 నుంచి రూ.1.50 కోట్ల మధ్య చెబుతున్నారు. ఇక 3 బీహెచ్‌కే అయితే రూ.3 కోట్ల పైమాటే. పైగా వెస్ట్ హైదరాబాద్ జనావాసాలు, కార్యాలయాలతో కిక్కిరిసిపోయింది. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! మీరే ఉత్తమ కస్టమర్ ఎన్నికల వాతావరణం నెలకొనడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో బిల్డర్లు ధర విషయంలో రాజీ పడతారు. ఉత్తమ కస్టమర్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎన్నికల సమయంలోనే కొనుగోలు నిర్ణయం తీసుకుంటారు. – నరేంద్ర కుమార్, ఎండీ, ప్రణీత్ గ్రూప్ ఇదీ చదవండి: రూ.వెయ్యి కోట్ల ఇల్లు.. వందేళ్ల చరిత్ర! -
16 కోట్ల ఫ్లాట్!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులు కూడబెట్టుకోవాలి. ఈ మంత్రాన్నే హీరోయిన్లు పాటిస్తుంటారు. కూడబెట్టడంలోనే కాదు ఖర్చుపెట్టడంలోనూ కొందరు హీరోయిన్లు ముందుంటారు. తాజాగా ఓ ఫ్లాట్ కోసం అక్షరాలా పదహారు కోట్లు ఖర్చు చేశారట తమన్నా. ఈ ఫ్లాట్‌లోంచి చూస్తే ఎగిసిపడే సముద్రం కనిపిస్తుందట. ఆ కనువిందు కోసమే ఇంత ఖర్చు. హీరోహీరోయిన్లు విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేయడం ఇదివరకు చాలా సందర్భాల్లో చూశాం. తాజాగా తమన్నా కూడా ఈ లిస్ట్‌లోకి గృహప్రవేశం చేయబోతున్నారు. ముంబైలోని ‘బే వ్యూ’ అనే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌ను మార్కెట్ రేటుకు రెండింతలు చెల్లించి సొంతం చేసుకున్నారని సమాచారం. సుమారు 16.6 కోట్లు తమన్నా ఖర్చు చేశారట. దీనికి తోడుగా 2 కోట్లతో ఇంటీరియర్ డిజైన్ చేయించాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే ఈ అపార్ట్మెంట్లోకి కుడి కాలు పెట్టనున్నారట. ప్రస్తుతం తమిళంలో ఓ రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. -
ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో మహిళలదే పైచేయి
ముంబై: ఇంటి కొనుగోలు నిర్ణయాల్లో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోంది. ఇంటిని కొనుగోలు చేయాలా? లేదా అద్దెకు తీసుకోవాలా? అనే అంశాల్లో మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ విషయం హౌసింగ్.కామ్ సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం..ఇంటికి సంబంధించిన కొనుగోలు, అద్దె వంటి అంశాల్లో 95 శాతానికి పైగా మహిళలే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే మహిళల శాతం 30కి పైగానే ఉంది. కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకునే మహిళలు 50 శాతంగా ఉన్నారు. ఇళ్లు, ఇతర రియల్టీ సంబంధిత నిర్ణయాలు తీసుకునేవారిలో 18-34 ఏళ్ల వయసున్న వారు ఎక్కువగా ఉన్నారు. ప్రాపర్టీ ప్లాట్‌ఫామ్స్‌ను సందర్శిస్తున్న మహిళలు 58 శాతంగా ఉన్నారు. ఇంటి కొనుగోలు, అద్దెకు సంబంధించిన లావాదేవీల్లో మహిళల పాత్ర పెరుగుతోంది. మహిళల స్వతంత్రత పెరిగే కొద్ది ఆస్తి కొనుగోలు నిర్ణయాల్లో వారి పాత్ర పెరుగుతుందని హౌసింగ్.కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రిషాబ్ గుప్తా తెలిపారు.