మా చిన్నారిని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపిద్దామన్నది నా భవిష్యత్తు ఆలోచన. రూపాయి మారకం విలువను హెడ్జ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? పెట్టుబడుల కాలవ్యవధి 21 ఏళ్లు. – ప్రవీణ్ షా
ఐదు, పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ నుంచి చూస్తే ఇప్పటికి చాలా వరకు క్షీణించినట్టు గుర్తించొచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ పరంగా పెద్దగా మారిందేమీ లేదు. వడ్డీ రేట్ల పరంగా అంతరం ఉంటున్నందున రూపాయి విలువ క్షీణత కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ చి న్నారి విదేశీ విద్య కోసం పొదుపు చేద్దామనుకుంటే అందుకు అంతర్జాతీయ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది.
సామర్థ్యం, దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చే పథకంలోనే ఇన్వెస్ట్ చేసుకో వాలి. మరింత మెరుగైన రాబడులను ఇచ్చే దేశీ మ్యూ చువల్ ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకుంటే మరింత మొత్తం సమకూరొచ్చు. కనుక మెరుగైన రాబడులను ఇవ్వలేని విదేశీ పథకాన్ని ఎంపిక చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోవచ్చు. కనుక అంతర్జాతీయ ఫండ్ ఎంపిక కీలకమని తెలుసుకోవాలి.
నా వయసు 22 సంవత్సరాలు. అద్దె ఇంట్లో ఉంటున్నాను. ఏ వయసుకు సొంతిల్లు సమకూర్చుకోవాలి? – రషీద్
సొంతిల్లు విషయంలో అందరికీ సరిపోయే ఏకైక ప్రామాణిక పరిష్కారం ఉందని అనుకోవడం లేదు. కాకపోతే ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఇవి సరైన నిర్ణయం తీసుకునేందుకు సాయపడతాయి. చాలా మందికి సొంతిల్లు ఆర్థికంగా అతిపెద్ద ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. ఇంటి రుణం పేరుతో అతిపెద్ద ఆర్థిక బాధ్యత వచ్చి పడుతుంది. ప్రతీ నెలా నిర్ణీత మొత్తం చొప్పున (ఈఎంఐ) చాలా ఏళ్లపాటు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చే ముందు ఆర్థికంగా ఏ మేరకు స్థిరపడ్డామన్నది ప్రతీ ఒక్కరూ ఆలోచించుకోవాలి.
తమ ఉద్యోగం లేదా వృత్తి జీవితంలో స్థిరత్వం గురించి స్పష్టతకు రావాలి. అప్పుడే తన ఆదాయంపై అంచనాకు రావచ్చు. వృత్తిపరంగా స్థిరత్వాన్ని సాధించారా? లేదంటే వచ్చే రెండు మూడేళ్లలో ఆ స్థాయికి చేరుకుంటామని భావిస్తున్నారా? ఈ విషయంలో స్పష్టత అవసరం. రెండో అంశం.. ఈఎంఐ కట్టాలన్న లక్ష్యంతో వ్యయాలను పూర్తిస్థాయిలో తగ్గించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ ఆదాయంలో ఈఎంఐ మూడింట ఒక వంతును మించకపోవడం సహేతుకమైనది. అప్పుడే ఇతర వ్యయాలను ఎదుర్కోవడానికి మీకు వెసులుబాటు ఉంటుంది. అంతేకాదు, ఇతర జీవిత లక్ష్యాలకూ కొంత ఆదా చేసుకోగలరు. నెలవారీ వేతనంలో ఈఎంఐ పరిమాణం ఎంతన్నది ముఖ్యమైనది.
మీకున్న రుణ పరపతి ఏ మేరకు, బ్యాంక్ బ్యాలన్స్ ఏ మేరకు? అన్న అంశాలను రుణమిచ్చే సంస్థలు చూస్తాయి. వీటి ఆధారంగా రుణ రేటును నిర్ణయిస్తాయి. రుణ పరపతి మెరుగ్గా ఉంటే, ఆకర్షణీయమైన రేటుకే గృహ రుణం అందుకోవచ్చు. ఇక ఇంటిని కొనుగోలు చేయడం అన్నది ఒక్క ఆర్థికపరమైన నిర్ణయమే కాదు. ఇందులో జీవిత భాగస్వామి ప్రాధాన్యాన్ని చాలా మంది పరిగణనలోకి తీసుకుంటారు. కనుక దంపతులు ఇద్దరూ కలసి తమ జీవిత లక్ష్యాలు, ఎక్కడ స్థిరపడాలి, ఎటువంటి ఇల్లు కొనుగోలు చేయాలన్న అంశాలను నిర్ణయించుకోవాలి.
- ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
Comments
Please login to add a commentAdd a comment