16 కోట్ల ఫ్లాట్‌! | Tamannaah pays double for fancy sea-view apartment in Mumbai | Sakshi
Sakshi News home page

16 కోట్ల ఫ్లాట్‌!

Published Tue, Jun 25 2019 2:10 AM | Last Updated on Tue, Jun 25 2019 2:10 AM

Tamannaah pays double for fancy sea-view apartment in Mumbai - Sakshi

తమన్నా

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. డిమాండ్‌ ఉన్నప్పుడే డబ్బులు కూడబెట్టుకోవాలి. ఈ మంత్రాన్నే హీరోయిన్లు పాటిస్తుంటారు. కూడబెట్టడంలోనే కాదు ఖర్చుపెట్టడంలోనూ కొందరు హీరోయిన్లు ముందుంటారు. తాజాగా ఓ ఫ్లాట్‌ కోసం అక్షరాలా పదహారు కోట్లు ఖర్చు చేశారట తమన్నా. ఈ ఫ్లాట్‌లోంచి చూస్తే ఎగిసిపడే సముద్రం కనిపిస్తుందట. ఆ కనువిందు కోసమే ఇంత ఖర్చు. హీరోహీరోయిన్లు విలాసవంతమైన ఇళ్లు కొనుగోలు చేయడం ఇదివరకు చాలా సందర్భాల్లో చూశాం.

తాజాగా తమన్నా కూడా  ఈ లిస్ట్‌లోకి గృహప్రవేశం చేయబోతున్నారు. ముంబైలోని ‘బే వ్యూ’ అనే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను మార్కెట్‌ రేటుకు రెండింతలు చెల్లించి సొంతం చేసుకున్నారని సమాచారం. సుమారు 16.6 కోట్లు తమన్నా ఖర్చు చేశారట. దీనికి తోడుగా 2 కోట్లతో ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించాలనుకుంటున్నారని తెలిసింది. త్వరలోనే ఈ అపార్ట్‌మెంట్‌లోకి కుడి కాలు పెట్టనున్నారట. ప్రస్తుతం తమిళంలో ఓ రెండు సినిమాలు, తెలుగులో రెండు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement