తమన్నా
ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్న టాప్ లిస్ట్ హీరోయిన్ తమన్నా ఇటీవల ముంబైలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. తమన్నా ముంబైలో ఇల్లు కొన్నారన్న వార్త కన్నా.. ఆమె ఆ ఫ్లాట్‌ను అక్కడ ఉన్న సాధారణ ఖరీదు కన్నా రెట్టింపు ధర చెల్లించి కొన్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ బ్యూటీ కొన్న ఫ్లాట్‌లోని ఏ వ్యూ నుంచి చూసినా సముద్రం కనిపిస్తుందట. అందుకే తమన్నా ఆ అపార్ట్‌మెంట్ కోసం అంత ఖర్చు చేశారన్నది బీ టౌన్ టాక్.
ఈ విషయంపై తమన్నా స్పందిస్తూ – ‘‘నేను ముంబైలో కొత్త ఫ్లాట్ కొన్నమాట వాస్తవమే. కానీ ప్రచారంలో ఉన్నట్లు డబుల్ అమౌంట్ మాత్రం పెట్టలేదు. ఇదే విషయమై మా హిందీ టీచర్ నాకు మొబైల్‌లో మెసేజ్ చేశారు. కాస్త ఆశ్చర్యానికి గురయ్యాను’’ అని వాపోయారు తమన్నా. ఇంకా కొత్త ఇంటి విశేషాలను చెబుతూ– ‘‘ప్రస్తుతం ఫ్లాట్ లోపలి వర్క్ జరుగుతోంది. పూర్తి కాగానే గృహ ప్రవేశం చేస్తాం. నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయడానికే నేను ఇష్టపడతాను’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment