సంతలో కూరగాయలు కొనేటప్పుడు పుచ్చులేమైనా ఉన్నాయా అని గమనిస్తాం. దుస్తులు షాపింగ్ చేసేముందు ట్రయల్ చేశాకే కొంటాం. బైక్, కారు కొనాలంటే మైలేజ్, వేగం, ధర వంటి అన్ని విషయాలు తెలుసుకున్నాకే తీసుకుంటాం. ..పదులు, వందలు, వేల రూపాయల ధర ఉండే వీటినే ఒకటి రెండు సార్లు ఆరా తీశాకే కొనుగోలు చేస్తాం. మరి, అలాంటిది జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలు విషయంలో తొందరెందుకు? ధరలు పెరుగుతున్నాయనో, ఆఫర్ మళ్లీ రాదనో, డిమాండ్ ఉందని తర్వాత బిల్డర్ రేటు ఎక్కువ చెబుతాడనో కంగారు పడొద్దు.
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్‌లో ఉంది. దీంతో గత నాలుగు నెలలుగా ప్రాపర్టీ విక్రయాలు 40–50 శాతం మేర తగ్గాయి. డిసెంబర్ వరకూ మార్కెట్ స్తబ్దుగానే కొనసాగుతుంది. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే జనవరి తర్వాత నగర స్థిరాస్తి రంగం పరుగులు పెట్టడం ఖాయం. లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పడి స్థిరపడే 4–5 నెలల వరకు స్తబ్ధ్దత కొనసాగుతుంది. ఆ తర్వాత పుంజుకుంటుంది. నగరంలో గత 3–4 ఏళ్లుగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఉన్న రేట్లతో పోలిస్తే కొనుగోలుదారులు జనవరి నుంచి 20–30 శాతం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: ప్రాపర్టీ కొంటున్నారా? ఈ జాగ్రత్తలు లేకుంటే రిస్కే!
ఔటర్ నుంచి 2 కి.మీ.లోపు..
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) కనెక్టివిటీ కారణంగా నగరం నలువైపులా ప్రయాణం సులువైపోయింది. దీంతో కొనుగోలుదారులు ఓఆర్‌ఆర్ నుంచి 2 కి.మీ. పరిధిలో ప్రాపరీ్టలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పైగా చ.అ.కు రూ.5–6 వేల మధ్య దొరకుతున్నాయి. వసతుల విషయంలో బిల్డర్లు రాజీపడటం లేదు. వెస్ట్‌తో పోలిస్తే 30–35 శాతం తక్కువ ధరకు ప్రాపర్టీలు దొరుకుతాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌లో విల్లాలు దొరుకుతాయి. అప్రిసియేషన్ కూడా వేగంగా ఉంటుంది. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, దుండిగల్, అన్నోజిగూడ, కొంపల్లి, బహదూర్‌పల్లి వంటి ప్రాంతాలలో ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. పశ్చిమ హైదరాబాద్‌లో చ.అ. 8–10 వేల మధ్య ఉన్నాయి. వసతులు, పన్నులు కలిపితే 2 బీహెచ్‌కే ఫ్లాట్ ఎంతలేదన్నా రూ.1.20 నుంచి రూ.1.50 కోట్ల మధ్య చెబుతున్నారు. ఇక 3 బీహెచ్‌కే అయితే రూ.3 కోట్ల పైమాటే. పైగా వెస్ట్ హైదరాబాద్ జనావాసాలు, కార్యాలయాలతో కిక్కిరిసిపోయింది.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
మీరే ఉత్తమ కస్టమర్
ఎన్నికల వాతావరణం నెలకొనడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో బిల్డర్లు ధర విషయంలో రాజీ పడతారు. ఉత్తమ కస్టమర్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు ఎన్నికల సమయంలోనే కొనుగోలు నిర్ణయం తీసుకుంటారు.
– నరేంద్ర కుమార్, ఎండీ, ప్రణీత్ గ్రూప్
ఇదీ చదవండి: రూ.వెయ్యి కోట్ల ఇల్లు.. వందేళ్ల చరిత్ర!
Comments
Please login to add a commentAdd a comment