బస్తీ (యూపీ): పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. వచ్చిన బాలుడి బట్టలిప్పించారు. మీద మూత్ర విసర్జన చేశారు. ఆ ఘటనను వీడియోలో చిత్రీకరించారు. వీడియోను ఫోన్ నుంచి తీసేయాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా వినిపించుకోలేదు. ఫిర్యాదు చేస్తే పోలీసులూ పట్టించుకోలేదు. అవమానం భరించలేక 17ఏళ్ల దళిత బాలుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జరిగింది.
సంత్ కబీర్‌నగర్ జిల్లాకు చెందిన బాలుడు బస్తీ జిల్లాలోని తన మేనమామ ఇంట్లో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ రాత్రి గ్రామస్తులు కొందరు బర్త్ డే పారీ్టకి బాలుడిని ఆహా్వనించారు. అక్కడికి చేరుకోగానే నలుగురు వ్యక్తులు అతడిని బట్టలు విప్పి, చితకబాదారు. మూత్ర విసర్జన చేసి అవమానించారు. అంతేకాదు ఉమ్మివేసి నాకాలని బలవంతం చేశారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియోలో బంధించారు. జరిగిన అవమానాన్ని బాలుడు ఇంట్లో చెప్పాడు. వీడియోను డిలీట్ చేయాలని కుటుంబ సభ్యులు వారిని కోరినా వినలేదు. దీంతో వారిపై కెపె్టన్‌గంజ్ పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. కానీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ఎస్‌హెచ్‌ఓ నిరాకరించారు.
నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ అవమానాన్ని భరించలేక సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాధితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. చివరకు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలపడంతో ఎస్పీ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కెపె్టన్‌గంజ్ ఎస్‌హెచ్‌ఓ దీపక్‌కుమార్ దూబేను సస్పెండ్ చేశారు. బాలుడి మేనమామ ఫిర్యాదు మేరకు సోమవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment