గుణవంత్‌రావు- లలితల సచిన్ (16).
సాక్షి, ఆసిఫాబాద్ : అంత్యక్రియల రోజే కుమారుడి చివరి జన్మదిన వేడుక నిర్వహించాల్సి రావడం కన్నా విషాదం ఏముంటుంది. ఇరవై ఏళ్లు కూడా నిండని కుర్రాడికి.. తెల్లవారితే పుట్టినరోజు.. వేడుకలకు అంతా సిద్ధమవుతుండగా.. హఠాన్మరణం చెందడంతో ఆ ఇంట కోలుకోలేని విషాదాన్ని నింపింది. కుమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లో శుక్రవారం కంటతడి పెట్టించిన ఈ సంఘటన వివరాలివి.
గ్రామానికి చెందిన చునార్కర్ గుణాంతరావు, లలిత దంపతుల చిన్న కుమారుడు సచిన్ (15) గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. శుక్రవారం పుట్టినరోజు కావడంతో స్నేహితులతో వేడుకలు చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కడుపులో మంటతో ఇబ్బందిపడడంతో ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు.
అక్కడ బాలుడు అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో సాయంత్రం మృతిచెందాడు. తెల్లవారితే జన్మదినోత్సవం జరుపుకోవాల్సిన అతడి మరణం మిత్రులు, కుటుంబసభ్యులు తట్టుకోలేకపోయారు. శుక్రవారం పుట్టినరోజు కావడంతో అదేరోజు అర్ధరాత్రి చివరిసారిగా తల్లిదండ్రులు మృతుని చేతితో కేక్ కట్ చేయిస్తూ గుండెలు పగిలేలా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment