ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ నగర్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేశారనే అనుమానంతో ఇద్దరు బాలరను బలవంతంగా యూరిన్ తాగిస్తూ, వారి ప్రైవేటు భాగాల్లో పచ్చి మిరపకాయలను రుద్దారు దుండగులు. జిల్లాలోని పత్రా బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంకటి చౌరాహా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులను తాడుతో కట్టేశారు. వారి వయస్సు 10 నుంచి 15 ఏళ‍్ల మధ్య ఉంటుంది. బాటిళ్లలో నింపిన యూరిన్‌ను బలవంతంగా పిల్లలచే తాగించారు. బూతులు తిడుతూ పచ్చి మిరపకాయలను వారి ప్రైవేట్ శరీర భాగాల్లో రుద్దారు. పసుపు రంగులో ఉండే ఏదో ద్రావణాన్ని కూడా బాధితుల శరీరంలోకి ఎక్కించినట్లు వీడియోలో చూపబడిందని పోలీసులు తెలిపారు. బాధితులు అరుస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ పాశవిక ఘటనపై స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు. నిందితులను గుర్తించినట్లు వెల్లడించారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సిద్దార్థ తెలిపారు.
ఇదీ చదవండి: అవయవ మార్పిడికి దేశంలో 56 వేల మంది వెయిటింగ్
Comments
Please login to add a commentAdd a comment