యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'హనుమాన్'. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి కలిగించాయి. తాజాగా విడుదలైన మరో పోస్టర్ మరింత ఆసక్తికరంగా ఉంది.
ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ మైఖెల్ పాత్రలో హీరో వినయ్ రాయ్ నటిస్తున్నాడు. తాజాగా ఆయన పోస్టర్‌ను రానా దగ్గుబాటి ఆవిష్కరించాడు. పోస్టర్ చూస్తుంటే ఇందులో వినయ్ రాయ్ అత్యంత బాడాస్ ఈవిల్ మ్యాన్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ లాంగ్ సూట్లో చుట్టూ డ్రోన్స్‌తో ఉన్న వినయ్ రాయ్ పోస్టర్ థ్రిల్లింగ్‌గా ఉంది. వినయ్ రాయ్ ఇంతకుముందు నీవల్లే నీవల్లే, వాన సినిమాలో హీరోగా అలరించాడు. కాగా ఈ మూవీలో ఓ కీరోల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్న విషయం తెలిసిందే.
చదవండి: చిరంజీవి బయోపిక్ గురించి నేను అలా అనలేదు: సీనియర్ నటుడు
Hanu-Man Movie: హను-మాన్ సినిమాలో విలన్‌గా హీరో.. పోస్టర్ రిలీజ్ చేసిన రానా
Published Wed, Jun 8 2022 11:00 AM | Last Updated on Wed, Jun 8 2022 12:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment