ఎన్టీఆర్తో అమైరా | Ntr, Koratala siva movie title janata gaage heroine amyra | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్తో అమైరా

Published Sun, Oct 25 2015 9:19 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

ఎన్టీఆర్తో అమైరా - Sakshi

ఎన్టీఆర్తో అమైరా

చాలా రోజులుగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో  సినిమా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఫీషియల్గా ఎనౌన్స్ చేయకపోయినా ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తుంది. అంతేకాదు తాజాగా ఈ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా టైటిల్ అంటూ ఓ ఇంట్రస్టింగ్ టైటిల్ టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో సినిమాలోనటిస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమా పూర్తి కాగానే కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు 'జనతా గ్యారేజ్' అనే టైటిల్ను ఫైనల్ చేశారట. 'అన్నీ రిపేర్ చేయబడును' అనే ట్యాగ్ లైన్  కూడా పెట్టినట్టుగా చెబుతున్నారు. టైటిల్ను బట్టి చూస్తే, ఎన్టీఆర్ ఈ సినిమాలో మెకానిక్గా కనిపించనున్నాడన్న విషయం అర్థమవుతోంది.

కొరటాల శివ డైరెక్షన్లో శ్రీమంతుడు లాంటి బ్లాక్బస్టర్ సక్సెస్ను నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముందు హీరోయిన్గా శృతి హాసన్ ను తీసుకోవాలని భావించినా, ప్రస్తుతం ధనుష్ సరసన అనేకుడు సినిమాలో నటించిన అమైరా దస్తర్ పేరు వినిపిస్తోంది. నాన్నకు ప్రేమతో రిలీజ్ తరువాత జనవరిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement