తమిళసినిమా: నటి శ్రుతీహాసన్ అసలు అందగత్తే కాదు. ఆమెను మేకప్ లేకుండా చూస్తే పారిపోతారు. శ్రుతీహాసన్ కంటే అందగత్తెలు కర్ణాటకలోని కళాశాలల్లో చాలా మంది ఉన్నారని కన్నడ నటుడు విమర్శల దాడి చేయడం వివాదాస్పదంగా మారింది. అసలు విషయం ఏమిటంటే ధృవ సార్జా హీరోగా నటించనున్న కన్నడ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నటి శ్రుతిహాసన్ తాను కన్నడ చిత్రంలో నటించడం లేదని తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. అంతే కన్నడ సినీ అభిమానులు తమ ఊరులోనే అందమైన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. మీరు మాకు అక్కర్లేదు అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల్లో శ్రుతిహాసన్‌పై విమర్శలు చేస్తున్నారు.
ఈ తతంగం అంతా చూసిన కన్నడ నటుడు జగ్గూష్ కర్ణాటకలో చాలా మంది అందమైన హీరోయిన్లు ఉన్నారనీ, అందువల్ల నిర్మాతలు శ్రుతిహాసన్ ఇంటి వాకిలిలో నిలబడి బిచ్చమెత్తాల్సిన అవసరం లేదని అన్నారు. అయినా నిర్మాతలు మారరని పేర్కొన్నారు. శ్రుతిహాసన్ కంటే అందగత్తేలు కర్ణాటకలో చాలా మంది ఉన్నారని, అసలు శ్రుతిహాసన్‌ను మేకప్ లేకుండా చూస్తే జనాలు పారిపోతారని ఆమెను చాలా తక్కువ చేస్తూ విమర్శల దాడి చేశారు. ఎలాంటి ప్రమేయం లేకుండా కన్నడ నటుడు జగ్గేష్ నటి శ్రుతిహాసన్‌పై విమర్శలు చేయడం వివాదాస్పదంగా మారింది. తాను కన్నడ చిత్రంలో నటించడం లేదని శ్రుతిహాసన్ క్లారిటీ ఇవ్వడం కూడా తప్పా? దీనికే ఇంతగా దిగజారి విమర్శిస్తారా? అంటూ తమిళ సినీ అభిమానులు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment