
‘‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది...’’ అంటూ ‘వేదం’ సినిమాలో అనుష్క హుషారుగా ఆడిపాడిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు శ్రుతీహాసన్ కూడా ఎగిరిపోవాలని ఉందంటున్నారు. అయితే, ఆ సినిమాలో సీన్‌కీ శ్రుతీహాసన్ ఎగిరిపోవాలనుకోడానికి సంబంధం లేదు. సీన్ కంప్లీట్ డిఫరెంట్. రీసెంట్‌గా శ్రుతీహాసన్ ట్రాఫిక్ సమస్యల వల్ల బాగా ఇబ్బందిపడుతున్నట్లున్నారు. ఆదివారం కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారట. దాంతో సహనం కోల్పోయారు. ‘‘ఈ ట్రాఫిక్ వల్ల బోలెడంత టైమ్ వేస్ట్ అవుతోంది.
రెక్కలు ఉంటే బాగుండేది. ఎంచక్కా ఎగరొచ్చు’’ అంటూ ట్విట్టర్‌లో తన అసహనం వ్యక్తం చేశారు. ఆ సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతం శ్రుతి చేతిలో పెద్దగా సినిమాలు లేవు. తండ్రి కమల్‌హాసన్ దర్శకత్వం వహిస్తూ, టైటిల్ రోల్ చేస్తోన్న ‘శభాష్ నాయుడు’లో ఆయనకు కూతురిగా నటిస్తున్నారు. కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నారట. త్వరలో ఓ మంచి కథ సెలక్ట్ చేసుకుని, ఆ చిత్రవివరాలను ప్రకటించాలనుకుంటున్నారట.