బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు పేరు చెబితేనే ట్రాఫిక్ సమస్యలు గుర్తుకువస్తాయి. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే బెంగళూరులో ఐటీ ఉద్యోగులు భారీగా నివసిస్తుండటంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు భరించలేనంత ఉంటుంది.
కిలోమీటర్ దూరం ప్రయాణించాలంటే వాహనాల మధ్య గంటల తరబడి ఇరుక్కుపోవాల్సి ఉంటుంది. రోడ్లపైకి వస్తే తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్తామో కూడా తెలియని పరిస్థితులు బెంగళూరు నగరంలో కనిపిస్తూ ఉంటాయి. ఇక వానకాలం కావడంతో బెంగళూరులో రోడ్లు మరీ దారుణంగా తయారయ్యాయి.
తాజాగా బెంగళూరు ట్రాఫిక్ గురించి గూగుల్ మ్యాప్స్ వెల్లడించిన అంశం ఆసక్తిగా మారింది. నెట్టింట్లో వైరల్‌గా మారింది. బెంగళూరు రోడ్లపై 6 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం కంటే, నడస్తూ వెళ్లడం ద్వారా త్వరగా చేరుకోవచ్చట. వి విషయాన్ని ఆయుష్ సింగ్ అనే వ్యక్తి గూగుల్ మ్యాప్ స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు.
ఇందులో బెంగళూరులో కేఆర్ పురం రైల్వే స్టేషన్ నుంచి గరుడాచార్ పాళ్యలోని బ్రిగేడ్ మెట్రోపొలిస్ వరకు ఏదైనా వాహనంలో వెళ్లడానికి 44 నిమిషాల సమయం పడితే, అదే దూరం నడిచి వెళ్లడానికి 42 నిమిషాలు పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోంది. ఇది కేవలం బెంగుళూరులోనే సాద్యమంటూ షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.
This happens only in Bangalore pic.twitter.com/MQlCP7DsU7
— Ayush Singh (@imabhinashS) July 25, 2024
ఒక్కరోజులోనే మూడు లక్షలకు పైగా లైకులు సంపాదించింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరు భారత్‌కు ట్రాఫిక్ రాజధాని అని, ముంబై, ఢిల్లీలో కూడా ఇదే రకమైన ట్రాఫిక్ ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment