
మాతృభాషలో తొలి విజయం
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. సక్సెస్ కోసం చాలా రోజులు పాటు వెయిట్ చేసిన అందాల భామ శృతిహాసన్. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ ఎక్కడా సక్సెస్ సాధించలేకపోయింది. చాలా కాలం తరువాత తెలుగులో తెరకెక్కిన 'గబ్బర్సింగ్' సినిమాతో తొలి హిట్ అందుకున్న శృతి ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు.
తెలుగులో వరుస సూపర్హిట్స్తో దూసుకుపోతున్న శృతిహాసన్, బాలీవుడ్ లో కూడా అదే జోరు చూపిస్తోంది. అయితే తన మాతృభాష అయిన తమిళ నాట మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్ని భాషల్లో విజయాలు సాధించినా కోలీవుడ్లో సక్సెస్ కాలేకపోవటంతో శృతికి కష్టంగా అనిపించింది. అయితే ఈ బాధను 'వేదలం' సినిమాతో తీర్చేసుకుంది ఈ బ్యూటీ.
అజిత్ హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేదలం' సినిమాతో మంచి సక్సెస్ను అందుకుంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సూపర్ హిట్ జోరు చూపిస్తోంది. ఏ సెంటర్స్లో పెద్దగా వర్క్అవుట్ కాకపోయినా.. బి, సి సెంటర్స్లో అజిత్ జోరు కనిపిస్తోంది. ఈ సక్సెస్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంది శృతిహాసన్.