vedalam
-
చిరు చెల్లెలుగా సాయి పల్లవి!
హీరోయిన్గా ఫుల్ ఫామ్‌లో ఉన్నారు సాయి పల్లవి. ఇలాంటి సమయంలో చెల్లెలు పాత్ర అంగీకరిస్తారా? ఆ పాత్ర చుట్టూ కథ తిరిగితే అప్పుడు అంగీకరించే అవకాశం ఉంది. తమిళ చిత్రం ‘వేదాళం’లో ఉన్న చెల్లెలు పాత్ర అలాంటిదే. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో చిరంజీవి హీరోగా నటించనున్నారు. తమిళంలో చెల్లెలి పాత్రను లక్ష్మీ మీనన్ చేశారు. తెలుగులో ఆ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారని సమాచారం. చిరంజీవి హీరోగా రూపొందనున్న సినిమా, పైగా పాత్ర కూడా గొప్పగానే ఉంటుంది.. ఈ రెండు కారణాలతో సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకుంటారని ఊహించవచ్చు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. -
పవర్ స్టార్ సినిమాకు నో చెప్పాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు పనిచేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారు. కానీ ఓ టాలీవుడ్ టెక్నిషియన్ మాత్రం ఈ గోల్డెన్ ఆఫర్‌ను కాదనేశాడు. పవన్ హీరోగా తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో ఏఎమ్ రత్నం, ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వేదలంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు హర్షవర్థన్‌ను రచయితగా తీసుకోవాలని భావించారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హర్షవర్థన్. అయితే చాలా కాలంగా దర్శకత్వం కోసం ఎదురుచూస్తున్న హర్షవర్థన్ ఇటీవలే దర్శకుడిగా తన తొలి సినిమాను ప్రారంభించాడు. దీంతో పవన్ సినిమాకు మాటలు రాసే అవకాశాన్ని వదులుకోవలసి వచ్చిందట. దీంతో పవన్ సినిమాకు మరో రచయితను ఎంపిక చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. హర్షవర్దన్ దర్శకుడిగా తన తొలి సినిమా సెట్స్ మీద ఉండగానే సుధీర్ బాబు హీరోగా మరో సినిమాను ప్రకటించాడు. -
జననాథన్ దర్శకత్వంలో అజిత్?
నటుడు అజిత్ చిత్రం అంటేనే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. కారణం ఆయన చిత్రాలు బ్రహ్మాండ విలువలతో పాటు, సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న అజిత్ ప్రస్తుతం వీరం, వేదాళం చిత్రాల తరువాత శివ దర్శకత్వంలో మూడో సారి నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ పతాకంపై త్యాగరాజన్ నిర్మిస్తున్న ఇందులో నటి కాజల్‌అగార్వల్ నాయకిగా నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం పోరాట దశ్యాలను చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. వేదాళం చిత్ర సమయంలో విపత్తు కారణంగా కాలుకు శస్త్ర చికిత్స చేయించుకున్న అజిత్ చిన్న విరామం అనంతరం నటిస్తున్న చిత్రం ఇది. ఇక పోతే సహజంగానే డూప్లతో చిత్రీకరించడానికి అంగీకరించని అజిత్ ఈ చిత్రంలోని రిస్కీఫైట్ సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే నటిస్తున్నారట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తదుపరి చిత్రం ఏమిటని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు, సినీ వర్గాలకు తాజా సమాచారం అజిత్ దర్శకుడు ఎస్పీ.జననాథన్ తో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నారన్నదే. ఇంతకు ముందు ఇయర్కై, పేరాన్మై, పొరంబోకు వంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రాలను తెరకెక్కించిన ఎస్పీ.జననాథన్ తాజాగా అజిత్ కోసం మంచి కథను తయారు చేశారని, ఆ కథ అజిత్‌కు వినిపించి ఓకే చేయించుకున్నారని సమాచారం. ఇది కూడా సోషల్ మెసేజ్‌తో కూడిన భారీ యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందని టాక్. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికపూర్వక ప్రకటన వెలువడాల్సిఉందన్నది గమనార్హం. -
పవన్ మూవీకి నో చెప్పిన బ్యూటీ!
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ మూవీలో ఆఫర్‌ను మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ రిజెక్ట్ చేసింది. అదేంటీ.. అగ్రహీరో మూవీలో ఛాన్స్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ఆమె నో చెప్పడానికి కారణం లేకపోలేదు. 'జెంటిల్మన్' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి మూవీతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. అయితే తమిళంలో హిట్ మూవీ వేదలంను తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయడానికి సన్నద్ధమయ్యాడు. పవన్ సరసన కీర్తి సురేష్, శృతిహసన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. తమిళ రీమేక్ మూవీలో పవన్ చెల్లిలి క్యారెక్టర్ లో నివేదా థామస్ కనిపించనుందని వదంతులు వచ్చాయి. ఈ విషయంపై నివేదా థామస్ స్పందించారని.. స్టార్ హీరో సరసన హీరోయిన్ గా జతకట్టేందుకు ఎవరైనా ఇష్టపడతారని, చెల్లిలి పాత్ర చేసేందుకు నాకు ఇష్టం లేదు అని చెప్పేసిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరోవైపు పవన్ కాటమరాయుడు మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాటమరాయుడు తర్వాతే వేదలం రీమేక్ పై పవన్ దృష్టి సారించనున్నాడు. -
పవర్ స్టార్‌కు నో చెప్పిన హీరోయిన్ ?
-
అఖిల్ హీరోయిన్‌తో పవన్ రొమాన్స్
ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తరువాత చేయబోయే రెండు సినిమాలను ప్రకటించేశాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలను లాంచనంగా ప్రారంభించిన పవన్, 2019లోపు ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కాటమరాయుడు సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాతి సినిమాలకు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. కాటమరాయుడు తరువాత తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఏఎమ్ రత్నం నిర్మించే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ వేదలంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన సయేషా సైగల్ హీరోయిన్గా నటించనుందట. అక్కినేని నట వారసుడు అఖిల్ సరసన హీరోయిన్గా పరిచయం అయిన సయేషా.., తరువాత బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన శివాయ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. 19 ఏళ్ల ఈ బ్యూటి తాజాగా పవన్ సినిమాలో అవకాశం రావటంతో తెగ సంబరపడిపోతుందట. -
పవన్‌కు జోడిగా నయన్
సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు స్పీడు పెంచాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తమిళ డైరెక్టర్ నేసన్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. అజిత్ హీరోగా తమిళ్లో ఘనవిజయం సాధించిన వేదలం సినిమాను పవన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమాను కాటమరాయుడు పూర్తయిన వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా పవన్ సరసన నయనతార హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ పాత్రకు నయన్, ఓకె చెప్పిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలోనే పవన్, నయన్‌ల జోడిపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుందంటున్నారు ఫ్యాన్స్. -
ఖుషీగా మొదలు
తెలుగు దర్శకులతో పాటు చెన్నై దర్శకుల కథలంటే పవన్‌కల్యాణ్‌కు ఆసక్తి ఎక్కువ. గతంలో పలు తమిళ చిత్రాలను రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారాయన. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న ‘కాటమరాయుడు’ కూడా తమిళ చిత్రం ‘వీరమ్’కి రీమేకే. తాజాగా మరో తమిళ రీమేక్‌కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటించిన ‘వేదాళం’ తెలుగు రీమేక్‌లో నటించడానికి అంగీకరించారాయన. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించనున్న ఈ చిత్రానికి ఆర్.టి.నేసన్ దర్శకుడు. విజయదశమి సందర్భంగా సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైందీ చిత్రం. దర్శకులు కరుణాకరన్, ఎస్.జె.సూర్య, ధరణి, విష్ణువర్ధన్ల తర్వాత పవన్‌కల్యాణ్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న తమిళ దర్శకుల్లో ఆర్.టి.నేసన్ ఐదో వ్యక్తి. ఎ.ఎం.రత్నం మాట్లాడుతూ - ‘‘పవన్‌కల్యాణ్‌తో మూడో చిత్రమిది. సూర్య మూవీస్ పతాకంపై ‘ఖుషి’, ‘బంగారం’ చిత్రాలు నిర్మించాం. నా పర్యవేక్షణలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఐశ్వర్య నిర్మిస్తున్న 4వ చిత్రమిది. కమర్షియల్ ఎంటర్టైనర్. త్వరలో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అన్నారు. ‘‘పవన్ ఇమేజ్‌కి తగ్గట్టు ‘వేదాళం’ కథలో మార్పులు చేశాం’’ అన్నారు దర్శకుడు ఆర్.టి.నేసన్. ఈ వేడుకలో నిర్మాత శరత్ మరార్, దర్శకుడు జ్యోతికృష్ణ, ఎ.ఎం.రత్నం సోదరుడు దయాకర్ పాల్గొన్నారు. -
మరో తమిళ దర్శకుడితో పవన్
సర్థార్ గబ్బర్‌సింగ్ రిజల్ట్‌తో ఆలోచనలో పడ్డ పవన్ కళ్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన ఫార్ములాను ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలు తమిళ దర్శకులతోనే కలిసి పనిచేశాడు. అంతేకాదు పవన్‌కు పవర్ స్టార్ ఇమేజ్ను కట్టబెట్టిన ఖుషి లాంటి సినిమాలు రీమేక్‌గా తెరకెక్కినవి. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా విషయంలో ఈ రెండు ఫార్ములాలను ఉపయోగిస్తున్నాడు పవన్. తన ప్రతి సినిమాకు గ్యాప్ తీసుకునే పవన్, ఈ సారి మాత్రం అలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. అయితే ఈ సినిమా అజిత్ హీరోగా తమిళ్లో ఘనవిజయం సాధించిన వీరం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ లుక్స్, స్టైల్ కూడా ఈ టాక్‌కు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ సినిమా తరువాత కూడా పవన్ మరో తమిళ దర్శకుడితో రీమేక్ సినిమాకే అంగీకరించాడట. అజిత్ హీరోగా తెరకెక్కిన వేదలం సినిమాను జిల్లా ఫేం నేశన్ దర్శకత్వంలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకపోయినా.., పవన్ హీరోగా వేదలం రీమేక్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు నేశన్. -
పవన్ తదుపరి సినిమా ఏది..?
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. పవన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై దృష్టిని కేంద్రీకరించారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా గతేడాది ఘన విజయం సాధించిన 'వెడలమ్' సినిమాను రిమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పవన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌ను పరిశీలించినట్టు పవన్ తెలిపారు. రిమేక్ చేయదలిస్తే తెలుగు సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు ,చేర్పులు చేయాల్పి ఉంటుందని, దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు. సూపర్ హిట్ చిత్రం ఖుషీ దర్శకుడు ఎస్.జె. సూర్యతో ఓ సినిమాలో చేసే ఆలోచనలో పవన్ ఉన్నారు. తన తదుపరి చిత్రం గురించి త్వరలోనే వెల్లడిస్తానని పవన్ తెలిపారు. -
పవన్ హీరోగా వేదలం రీమేక్
సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో వార్తలు ఊపందుకున్నాయి. ఎస్ జె సూర్య డైరెక్షన్ లో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపించినా, పవన్ ఆ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడని అర్థమై పోయింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అజిత్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు యాక్షన్, హీరోయిజం పుష్కలంగా ఉన్నాయి. అందుకే తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన ఎ ఎమ్ రత్నం తెలుగులోనూ పవన్ హీరోగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్‌తో రభస సినిమాను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడంటూ వచ్చిన వార్తలను రత్నం ఖడించాడు. పవన్ కళ్యాణ్‌తో వేదలం రీమేక్ చేస్తున్న మాట నిజమే కాని, ఆ సినిమాకు సాంకేతిక నిపుణులను, నటీనటులను ఇంత వరకు ఫైనల్ చేయలేదని తేల్చేశాడు. దీంతో ఈ సినిమా ఎవరి డైరెక్షన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
అభిమానులను భయపెడుతున్నాడు
ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్లో ఉన్న పవన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అఫీషియల్‌గా ఏ సినిమా చేయబోయేది కన్ఫామ్ చేయకపోయినా.. పవన్ నెక్ట్స్ సినిమా దర్శకులుగా వినిపిస్తున్న పేర్లు మాత్రం, అభిమానులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా సక్సెస్‌కు చాలా దూరంలో ఉన్న దర్శకులు పవన్‌తో సినిమాకు రెడీ అవుతున్నారన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.మొన్నటి వరకు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్యతో పవన్ నెక్ట్స్ సినిమా ఉంటుందన్న వార్త టాలీవుడ్లో షికారు చేసింది. దాదాపుగా కన్ఫామ్ అయిన ఎస్ జె సూర్య ప్రాజెక్ట్‌ను ఇప్పుడు పవన్ పక్కన పెట్టేశాడట. తమిళ్లో సూపర్ హిట్ అయిన అజిత్ వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా విషయంలో కూడా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు పవర్ స్టార్. కందిరీగ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత రభసతో భారీ డిజాస్టర్‌ను అందించిన సంతోష్ శ్రీనివాస్‌ను వేదలం రీమేక్‌కు దర్శకుడిగా ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు ఈ సినిమా రిజల్ట్‌పై డౌట్ పడుతున్నారు. మరి పవన్ ఈ కాంబినేషన్లో సినిమా చేస్తాడా లేక.. మరో గాసిప్‌తో ఆడియన్స్ ను తికమక పెడతాడా.. చూడాలి. -
'వేదలం' రీమేక్ లో పవన్!
అజిత్ హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన 'వేదలం' సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నందమూరి హీరోలు నటించే అవకాశముందని ఇప్పటివరకు ఊహాగానాలు విన్పించాయి. అయితే మరో టాప్ హీరో పేరు తెరపైకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాకు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. 'ఖుషి'తో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో 'వేదలం' రీమేక్ చేసేందుకు పవన్ అంగీకరించారని సినీవర్గాల సమాచారం. 'చాలా స్టోరీ లైన్లు అనుకున్నా వర్కవుట్ కాలేదు. వేదలం కథ పవన్ కు బాగా కుదురుతుందని భావించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ రెవేంజ్ స్టోరీని తెలుగులోనూ తెరకెక్కించాలని నిర్ణయించార'ని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ మొదలైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా దర్శకుడు ఎస్ జే సూర్య పలుమార్లు 'సర్దార్ గబ్బర్ సింగ్' సెట్ వచ్చారట. 'వేదలం' సినిమా నిర్మాత కూడా ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసారని సమాచారం. 'వేదలం' సినిమా రీమేక్ లో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించే అవకాశముందని అంతకుముందు ఊహాగానాలు వచ్చాయి. -
ఎన్టీఆర్ మనసుపడ్డాడట..?
అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా 'వేదలం'. ఇటీవల విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. లాంగ్‌రన్‌లో వంద కోట్లు వసూలు చేయటం ఖాయంగా కనిపిస్తున్న 'వేదలం' సినిమాపై టాలీవుడ్ హీరోల కన్నుపడిందట. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాను స్పెషల్‌గా షో వేయించుకొని మరీ చూశాడు. గతంలో కూడా ఎన్టీఆర్ తమిళ సినిమా రీమేక్ మీద దృష్టిపెట్టాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన 'కత్తి' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ అయినట్టే కనిపించినా, సెట్స్ మీదకు మాత్రం రాలేదు. తాజాగా 'వేదలం' సినిమా విషయంలో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌పై ఎన్టీఆర్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. 'నాన్నకు ప్రేమతో..' షూటింగ్లో ఉన్న జూనియర్ ఆ సినిమా పూర్తయ్యాక వేదలం సినిమాను ఫైనల్ చేసే అవకాశం ఉంది. 'వేదలం' సినిమాను 'ఆవేశం' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో తెలుగులో 'అఖిల్' రిలీజ్ ఉండటంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం రీమేక్ వార్తలు వస్తున్న నేపథ్యంలో డబ్బింగ్ వర్షన్ రిలీజ్‌పై అనుమానాలు ఏర్పాడ్డాయి. ఎన్టీఆర్‌తో పాటు రీ ఎంట్రీకి రెడీ అవుతున్న మెగాస్టార్ కూడా వేదలం సినిమా రీమేక్‌పై ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆవేశంగా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతుందా..? లేకా రీమేక్ అవుతుందా..? తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
'నా పేరు శృతిహాసన్, సరిగా పలకండి'
సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేసేస్తున్న స్టార్ హీరోయిన్ శృతి హాసన్‌ను ఓ వింత సమస్య ఇబ్బంది పెడుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ క్రేజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ పేరును చాలా మంది సరిగ్గా పలకటం లేదట. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించిన శృతి.. తన పేరుకు కరెక్ట్ స్పెలింగ్ ఏంటో చెప్పింది. 'ప్రజలు నా పేరును కరెక్ట్ గా పలకాలని కోరుతున్నా, నా పేరు శృతిహాసన్' అంటూ ట్వీట్ చేసింది ఈ బ్యూటీ. చాలామంది శ్రితి, స్తృధి, సురుధి, శ్రూతీ, హస్సన్ లేదా శ్రుతి హుస్సేన్ అని కూడా అంటున్నారంటూ బుంగమూతి పెట్టి వాపోయింది. ఇటీవల అజిత్ సరసన హీరోయిన్ గా నటించిన వేదలం సినిమాతో సూపర్ హిట్ సాధించిన ఈ బ్యూటీ, ప్రస్తుతం హిందీలో రెండు, తమిళంలో ఒకటి, తెలుగులో మూడు సినిమాలతో బిజీగా ఉంది. నటిగానే కాక సింగర్ కూడా తనసత్తా చాటుతున్న శృతీహాసన్ ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా టాప్ ప్లేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. Ugh I really wish people would spell my name right its SHRUTI HAASAN not shriti ,Strudhi ,surudhi,shroothy,hassan or the sruthi Hussain — shruti haasan (@shrutihaasan) November 18, 2015 -
మళ్లీ ఫాంలోకి వచ్చాడు
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా పేరున్న సూర్య మూవీ ఇటీవల కాలంలో ఆ జోరు చూపించలేకపోతుంది. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్స్‌తో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత ఏఎమ్ రత్నం.. తర్వాత ఆ స్ధాయి విజయాలు సాధించలేకపోయాడు. ముఖ్యంగా ఒక కొడుకును హీరోగా, మరో కొడుకును దర్శకుడిగా పరిచయం చేసిన రత్నం, వారిని ఇండస్ట్రీలో నిలబెట్టే క్రమంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో చాలాకాలం సినిమాలకు దూరంగానే ఉండిపోయాడు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రత్నం, ప్రస్తుతం మళ్లీ మంచి ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపిస్తున్నాడు. తన పాత బ్యానర్ శ్రీ సూర్యా మూవీస్ కలిసి రాలేదనుకున్నాడో ఏమో గాని, రీ ఎంట్రీలో కొత్త బ్యానర్ మీద సినిమాలు చేస్తున్నాడు. తన కూతురుని నిర్మాతగా పరిచయం చేస్తూ శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కిన ఆరంభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన రత్నం తరువాత, వరుసగా ఎన్నై అరిందాల్, వేదలం సినిమాలను అజిత్ హీరోగానే తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలు భారీ విజయాలు నమోదు చేయటంతో ఏఎమ్ రత్నం చాలా ఆనందం గా ఉన్నాడు. 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన వేదలం ఫస్ట్ వీకెండ్లోనే సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది. భారీ వర్షాలు పడుతున్నా, ఇప్పటికీ మంచి కలెక్షన్లు వస్తుండటంతో ఈ సినిమా లాంగ్ రన్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనినిస్తోంది. దీంతో మరోసారి ఏఎమ్ రత్నంకు పూర్వ వైభవం రావడం ఖాయం అంటున్నారు కోలీవుడ్ సినీ అభిమానులు. -
అజిత్ హీరోగా హ్యాట్రిక్ సినిమా
తెలుగు సినిమా 'శౌర్యం'తో దర్శకుడిగా పరిచయం అయి, తర్వాత కోలీవుడ్ స్టార్ స్టేటస్ అందుకున్న దర్శకుడు శివ. సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం శాఖలోకి వచ్చిన ఈ డైరెక్టర్ తమిళనాట వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఓ కోలీవుడ్‌లో అజిత్ హీరోగా ఓ సూపర్ హిట్ సినిమాను అందించిన శివ అదే హీరోతో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. శివ, అజిత్‌ల కాంభినేషన్ లో రూపొందిన తొలి సినిమా వీరం. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే దర్శకుడితో వేదలం సినిమాను చేశాడు అజిత్. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించటంతో ఇప్పుడు అదే కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న అజిత్ రెండు నెలల పాటు షూటింగులకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అజిత్, శివల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో సినిమాను సంక్రాంతికి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే వీరం, ఎన్నై అరిందాల్, వేదలం సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించిన అజిత్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
వర్షంతో తగ్గిన సినిమా వసూళ్లు
తమిళసినిమా : తమిళనాడులో సినిమా వసూళ్లకు వర్షాలు చెక్ పెట్టాయి. ప్రేక్షకులు లేక థియేటర్లు వెలవెలపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు విలవిలలాడుతున్నారు. నిన్నటి వరకూ భానుడి భగభగలతో మండిపోయిన జనం ఇప్పుడు వరుడి ప్రతాపంతో వణికిపోతున్నారు. సంక్రాంతి, దీపావళి వంటి పండగల సందర్భాల్లో సినిమా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. భారీ చిత్రాలు విడుదలవడమే అందుకు కారణం. నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్టకు గల్లాపెట్టెలు కాసులతో కళకళలాడేది అప్పుడే. ఈ ఏడాది దీపావళికి విశ్వనటుడు కమలహాసన్ తూంగావనం, మాస్ హీరో అజిత్ వేదాళం చిత్రాలు భారీ అంచనాలతో తెరపైకి వచ్చాయి. ఈ చిత్రాల కారణంగా పలు చిన్న బడ్జెట్ చిత్రాల విడుదల వాయిదాపడింది. ఊహించినట్లుగానే రెండు చిత్రాలు మంచి టాక్‌నే తెచ్చుకున్నాయి. నాలుగు రాళ్లు సంపాదించుకోవచ్చునని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం సంబరపడిపోయారు. విడుదలయిన తొలి రెండు రోజులు తూంగావనం, వేదాళం చిత్రాలు మంచి కలెక్ష న్లను రాబట్టుకున్నాయి. అలాంటి పరిస్థితిలో వసూళ్లకు వర్షం గండికొట్టింది. రోడ్లంతా జలమయం కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు రాలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో సుమారు 120 థియేటర్లు వరద కారణంగా ముంపునకు గురైనట్లు డిస్ట్రిబ్యూటర్ల వర్గాలు వెల్లడించాయి. న గరాల్లో కూడా థియేటర్లకు ప్రేక్షకులు ఎక్కువగా రావడం లేదని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సెలవులు కాస్తా వర్షంతోనే వెళ్లిపోయాయని తెలిపారు. షూటింగ్‌లకు ఆటంకం చిత్రాల వసూళ్లకు చెక్ పెట్టిన వర్షం షూటింగ్‌లకూ తీవ్ర ఆటంకంగా మారింది. గురువారం నుంచి వర్షం కురుస్తుండటంతో అవుట్ డోర్లో షూటింగ్‌లు చేస్తున్న వారికి చాలా కష్టాలు ఎదురవుతున్నాయని చిత్ర వర్గాలు ఆవేదక వ్యక్తం చేస్తున్నాయి. -
మాతృభాషలో తొలి విజయం
స్టార్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా.. సక్సెస్ కోసం చాలా రోజులు పాటు వెయిట్ చేసిన అందాల భామ శృతిహాసన్. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా అన్ని భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ ఎక్కడా సక్సెస్ సాధించలేకపోయింది. చాలా కాలం తరువాత తెలుగులో తెరకెక్కిన 'గబ్బర్‌సింగ్' సినిమాతో తొలి హిట్ అందుకున్న శృతి ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో వరుస సూపర్‌హిట్స్‌తో దూసుకుపోతున్న శృతిహాసన్, బాలీవుడ్ లో కూడా అదే జోరు చూపిస్తోంది. అయితే తన మాతృభాష అయిన తమిళ నాట మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎన్ని భాషల్లో విజయాలు సాధించినా కోలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోవటంతో శృతికి కష్టంగా అనిపించింది. అయితే ఈ బాధను 'వేదలం' సినిమాతో తీర్చేసుకుంది ఈ బ్యూటీ. అజిత్ హీరోగా, శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'వేదలం' సినిమాతో మంచి సక్సెస్‌ను అందుకుంది. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సూపర్ హిట్ జోరు చూపిస్తోంది. ఏ సెంటర్స్‌లో పెద్దగా వర్క్అవుట్ కాకపోయినా.. బి, సి సెంటర్స్‌లో అజిత్ జోరు కనిపిస్తోంది. ఈ సక్సెస్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంది శృతిహాసన్. -
తమిళనాట తలా రికార్డ్
ఈ దీపావళి పండుగ తమిళ సినీ అభిమానులకు మరింత కిక్ ఇచ్చింది. కోలీవుడ్‌లో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న ఇద్దరు స్టార్ హీరోలు దీపావళి సందర్భంగా తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకనాయకుడు కమల్ హాసన్ 'తుంగావనం' సినిమాను రిలీజ్ చేయగా, అజిత్ 'వేదలం'తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావటంతో తమిళ ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు. 'వేదలం' సినిమాతో అజిత్ సరికొత్త రికార్డును ఆవిష్కరించాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్ అందుకు తగ్గట్టుగానే తొలి రోజు కలెక్షన్ల విషయంలో రజనీ, విజయ్ లాంటి టాప్ స్టార్లకు షాకిచ్చాడు. గతంలో విజయం హీరోగా నటించిన 'కత్తి' సినిమా తొలిరోజు 12.5 కోట్ల వసూళ్లు చేయగా, రజనీ కాంత్ హీరోగా నటించిన 'లింగా' సినిమా 12.8 కోట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ రెండు రికార్డులను చెరిపేస్తూ అజిత్ వేదలం సినిమాతో 15.5 కోట్ల తొలి రోజు వసూళ్ల రికార్డ్‌ను సెట్ చేశాడు. గతంలో 'వీరం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శివ దర్శకత్వంలో, అజిత్ చేసిన సినిమా కావటంతో పాటు తొలిసారిగా అజిత్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించటంతో, ఈ సినిమా రిలీజ్‌కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు వసూళ్లతోనే సత్తా చాటిన వేదలం మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది. -
మరో హీరోకి లీకేజ్ ప్రాబ్లమ్
ప్రస్తుతం ఇండస్ట్రీని వేదిస్తున్న సమస్యల్లో పైరసీ అన్నింటికంటే పెద్దది. ఇన్నాళ్లు సినిమా రిలీజ్ తరువాత ఇండస్ట్రీ వర్గాలను ఇబ్బంది పెడుతూ వస్తున్న ఈ పైరసీ భూతం మారుతున్న టెక్నాలజీ కారణంగా రిలీజ్‌కు ముందే చిత్ర యూనిట్‌కు షాక్ ఇస్తోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చాలా చిత్రాలు విడుదలకు ముందే ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. తాజాగా అజిత్ హీరోగా తెరకెక్కిన 'వేదలం' సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైంది. గతంలో పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' రిలీజ్‌కు ముందే దాదాపు సగం సినిమా నెట్లో దర్శనమిచ్చింది. అయితే ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో నిర్మాతకు ఎలాంటి నష్టం రాలేదు. తరువాత 'బాహుబలి', 'పులి' లాంటి భారీ చిత్రాలకు కూడా ఇదే సమస్య ఎదురైంది. అయితే టెక్నాలజీ పరంగా గ్రాఫిక్స్, రీ రికార్డింగ్, డిఐ లాంటి సాంకేతికతల కోసం చాలా మంది చేతులు మారుతున్న సినిమాలు, ఎక్కడో ఒకచోట పైరసీ బారిన పడుతున్నాయి. అదే బాటలో అజిత్ హీరోగా నటిస్తున్న వేదలం సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు మరికొన్ని కీలక సన్నివేశాలు శుక్రవారం నెట్లో దర్శనమిచ్చాయి. వెంటనే స్పందించిన చిత్ర నిర్మాత ఎఎం రత్నం సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఆ సీన్స్‌ను తొలగించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అజిత్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు శివ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.