పవన్ హీరోగా వేదలం రీమేక్ | am rathnam clarifies on vedalam remake with pawan kalyan | Sakshi
Sakshi News home page

పవన్ హీరోగా వేదలం రీమేక్

Published Sun, Feb 7 2016 11:23 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ హీరోగా వేదలం రీమేక్ - Sakshi

పవన్ హీరోగా వేదలం రీమేక్

సర్దార్ గబ్బర్సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో వార్తలు ఊపందుకున్నాయి. ఎస్ జె సూర్య డైరెక్షన్ లో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపించినా, పవన్ ఆ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడని అర్థమై పోయింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు.

అజిత్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఇమేజ్కు తగ్గట్టు యాక్షన్, హీరోయిజం పుష్కలంగా ఉన్నాయి. అందుకే తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన ఎ ఎమ్ రత్నం తెలుగులోనూ పవన్ హీరోగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్తో రభస సినిమాను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడంటూ వచ్చిన వార్తలను రత్నం ఖడించాడు.

పవన్ కళ్యాణ్తో వేదలం రీమేక్ చేస్తున్న మాట నిజమే కాని, ఆ సినిమాకు సాంకేతిక నిపుణులను, నటీనటులను ఇంత వరకు ఫైనల్ చేయలేదని తేల్చేశాడు. దీంతో ఈ సినిమా ఎవరి డైరెక్షన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement