'హరి హర వీరమల్లు' విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్‌ | Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Release Date Locked, Poster Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

'హరి హర వీరమల్లు' విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్‌

Published Mon, Sep 23 2024 1:03 PM | Last Updated on Tue, Sep 24 2024 11:47 AM

Hari Hara Veera Mallu Movie Release Date Locked

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్‌ మళ్లీ పట్టాలెక్కింది. ఈ క్రమంలోనే విడుదల తేదీని కూడా మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. సుమారు నాలుగేళ్ల క్రితం షూటింగ్‌ ప్రారంభించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయవాడలో ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్‌ను మేకర్స్‌ వేశారు. దీంతో నేటి నుంచి  'హరి హర వీరమల్లు' కొత్త షెడ్యూల్‌లో పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు.

పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా 'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్‌ను క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్‌-1 మాత్రం వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 

ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్‌, బాబీ దేవోల్‌,నోరాహి ఫతేహి, నిధి అగర్వాల్‌, విక్రమ్‌ జీత్‌, జిషుసేన్‌ గుప్త కీలక పాత్రలలో నటించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్‌ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement