AM rathnam
-
'హరి హర వీరమల్లు' విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగ్ మళ్లీ పట్టాలెక్కింది. ఈ క్రమంలోనే విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సుమారు నాలుగేళ్ల క్రితం షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే, విజయవాడలో ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్‌ను మేకర్స్ వేశారు. దీంతో నేటి నుంచి 'హరి హర వీరమల్లు' కొత్త షెడ్యూల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 'హరి హర వీరమల్లు' ప్రాజెక్ట్‌ను క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్-1 మాత్రం వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు అధికారికంగా ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్,నోరాహి ఫతేహి, నిధి అగర్వాల్, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త కీలక పాత్రలలో నటించారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఏఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)
-
‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పేలా..
రవి వర్మ, సంజనా సింగ్, అలోక్ జైన్, మనీషా దేవ్, జీవ ముఖ్య పాత్రల్లో చౌడప్ప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్’. సోమిశెట్టి హరికృష్ణ సమర్పణలో ఎంసీ రావు, జి. గోపాల్, ఎమ్.వి మల్లికార్జునరావు, కోసూరి సుబ్రహ్మణ్యం, మణి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలకానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత ఏయం రత్నం విడుదల చేశారు. చౌడప్ప మాట్లాడుతూ– ‘‘దేశానికి పట్టిన చీడ పురుగులను ఏరేసే ప్రయత్నంలో బుద్ధుడు కూడా రుద్రుడౌతాడు. ‘బుద్ధం శరణం గచ్చామి’ కాదు.. ‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పే సినిమా ఇది. రవి వర్మ కొత్తవాడైనా బాగా చేశాడు’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది తొలి చిత్రం. ప్రేక్షకుల ఆదరణ కావాలి’’ అన్నారు రవి వర్మ. -
పవన్ 27: ప్రీలుక్ పోస్టర్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు మరో సర్ప్రైజ్ వచ్చేసింది. ఇప్పటికే ఆయన నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం నుంచి మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా పవన్ 27వ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. పవన్ కల్యాణ్- క్రిష్ జాగర్లపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ చేతికి బంగారు రంగులో ఉన్న కడియంతో పాటు రెండు వేళ్లకు ఉంగరాలు కూడా ఉన్నాయి. అలాగే నడుముకు ఎర్ర కండువా కట్టుకున్నారు. దానికి గరుత్మంతుడి బొమ్మకూడా ఉంది. ఈ వేషధారణ చూస్తుంటే ఇదేదో రాబిన్‌హుడ్ పాత్రలా అనిపిస్తోంది. (ఆ వార్త నా మనసును కలిచివేసింది: పవన్) ఈ చిత్రం గురించి క్రిష్ మాట్లాడుతూ.. "ఈ సినిమా పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్" అని ట్వీట్ చేశారు. కాగా ఈ సినిమా షూటింగ్ ఇదివరకే ప్రారంభమైంది. కానీ లాక్డౌన్ కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది. సినిమా కథ విషయానికొస్తే మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా రూపుదిద్దుకోనుందని భోగట్టా. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ ఫైట్లు కంపోజ్ చేస్తున్నారు. (పవన్ చిత్రంలో రామ్‌చరణ్?) -
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని
‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ప్రెసిడెంట్‌గా ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రధాన సలహాదారునిగా నిర్మాత ఏ.యమ్ రత్నం, వైస్ ప్రెసిడెంట్‌గా నిర్మాత గురురాజ్, రంగా రవీంద్ర గుప్తా, అలీ భాయ్, సెక్రెటరీలుగా కె.వి. రమణా రెడ్డి, కె .సత్యనారాయణ , ఆర్గనైజయింగ్ సెక్రెటరీలుగా వి. మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, జాయింట్ సెక్రెటరీలుగా సతీష్, నాగరాజు గౌడ్, జి. శంకర్ గౌడ్, కోశాధికారిగా రామానుజం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటుగా ఈసీ మెంబర్స్‌గా వి. కృష్ణ రావు, హెచ్. కృష్ణ రెడ్డి, అలెక్స్, ఇ .సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్ గౌడ్, టి. శ్రీనివాస్ గౌడ్, టి. రాజేష్, ఎమ్. వెంకటేష్, ముఖావర్ వలి, మహాలక్ష్మి, బి. నాగరాజు (జడ్చెర్ల ) ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ప్రెసిడెంట్ పి.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. పది ఎకరాల్లో సినీ వర్కర్స్ ఇళ్ల కోసం స్థలం కేటాయిస్తాం. కల్చరల్ సెంటర్ కోసం స్థల కేటాయింపుతో పాటు 24 శాఖల్లోని వర్కర్స్ అందరికీ పని దొరికేలా చూస్తాం. త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి ఇవ్వన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలని తీర్మానించుకున్నాం’’ అన్నారు. -
బాగున్నా బాగా లేదనడం న్యాయం కాదు
‘‘ సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ అయిపోయింది. సినిమా షో కంప్లీట్ అయ్యే లోపే సినిమా రిజల్ట్‌ను తేల్చేస్తున్నారు. పాత రోజుల్లో సినిమా రివ్యూలను వారం లేదా పది రోజుల తర్వాత రాసేవారు. ఇప్పుడు షో తర్వాతే రేటింగ్‌లు ఇచ్చేస్తున్నారు. బాగాలేని సినిమాని బాగుందని రాయమని అడగం. కానీ, బాగున్న సినిమాని బాగాలేదని రాయడం న్యాయం కాదు. ఇది నా సొంత అభిప్రాయం’’ అన్నారు నిర్మాత ఏ.ఎం. రత్నం. గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎం. రత్నం సమర్పణలో ఎస్. ఐశ్వర్య నిర్మించిన చిత్రం ‘ఆక్సిజన్’. గురువారం విడుదల అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా ఏ.ఎం. రత్నం విలేకర్లతో చెప్పిన విశేషాలు... ► కమర్షియల్ అంశాలతో పాటు మెసేజ్ ఉన్న సినిమా ‘ఆక్సిజన్’. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మౌత్ టాక్ బాగుంది. కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. ప్రజెంట్ డేస్‌లో సందేశాత్మక చిత్రాలకు ప్రేక్షకాదరణ తగ్గింది. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ సినిమాలు ఎంటర్టైన్ చేస్తూనే ప్రేక్షకులకు మంచి మేసేజ్ ఇచ్చాయి. సినిమాలు చూసి ప్రజలు సడన్‌గా మారతారని అనుకోను. వారు ఆలోచిస్తే చాలు అన్నదే మా ప్రయత్నం. అప్పట్లో ‘కర్తవ్యం’ సినిమా చాలామంది మహిళలను ఇన్స్పైర్ చేసింది. ► ‘ఆక్సిజన్’ ఏ లాంగ్వేజ్‌లో అయినా బాగుంటుంది. ‘హిందీలో తీద్దాం. అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గణ్‌లకు చూపిద్దాం’ అని నా ఫ్రెండ్ అన్నాడు. సినిమా రిలీజ్ కాకముందు కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌కు చూపిద్దామనుకున్నా. తమిళ రీమేక్ ఆలోచన ఉంది. పవన్ కల్యాణ్‌తో ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్ అంటే.. అది ఆయనే డిసైడ్ చేస్తారు. ఇకపై తెలుగు సినిమాలపై కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నాను. -
థమన్ తొలిసారి..!
నటుడిగా ఎంట్రీ ఇచ్చి తరువాత సంగీత దర్శకుడు మంచి విజయాలు సాధిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. అతి తక్కువ కాలంలో 50కి పైగా సినిమాలకు సంగీతం అందించిన తమన్ దాదాపు ఈ జనరేషన్ స్టార్ హీరోలందరితో కలిసి పనిచేశాడు. అయితే పవర్ స్టార్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ మాత్రం ఈ యువ సంగీత దర్శకుడికి రాలేదు. అయితే త్వరలోనే థమన్‌కు ఆ కోరిక కూడా తీరనుంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్. ఈ సినిమా తరువాత ఏఎమ్ రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీత అందించనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు థమన్. పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించటం చాలా ఆనందంగా ఉందన్నాడు థమన్.Hello guys Very Very happy to announce my next film with our power star @PawanKalyan gaaru dir by dear #neason Produced by Rathnam Sir— thaman ss (@MusicThaman) 7 November 2016 -
మరో తమిళ దర్శకుడితో పవన్
సర్థార్ గబ్బర్‌సింగ్ రిజల్ట్‌తో ఆలోచనలో పడ్డ పవన్ కళ్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన ఫార్ములాను ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాలు తమిళ దర్శకులతోనే కలిసి పనిచేశాడు. అంతేకాదు పవన్‌కు పవర్ స్టార్ ఇమేజ్ను కట్టబెట్టిన ఖుషి లాంటి సినిమాలు రీమేక్‌గా తెరకెక్కినవి. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా విషయంలో ఈ రెండు ఫార్ములాలను ఉపయోగిస్తున్నాడు పవన్. తన ప్రతి సినిమాకు గ్యాప్ తీసుకునే పవన్, ఈ సారి మాత్రం అలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. అయితే ఈ సినిమా అజిత్ హీరోగా తమిళ్లో ఘనవిజయం సాధించిన వీరం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ లుక్స్, స్టైల్ కూడా ఈ టాక్‌కు బలం చేకూరుస్తున్నాయి. అయితే ఈ సినిమా తరువాత కూడా పవన్ మరో తమిళ దర్శకుడితో రీమేక్ సినిమాకే అంగీకరించాడట. అజిత్ హీరోగా తెరకెక్కిన వేదలం సినిమాను జిల్లా ఫేం నేశన్ దర్శకత్వంలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకపోయినా.., పవన్ హీరోగా వేదలం రీమేక్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు నేశన్. -
పవన్ హీరోగా వేదలం రీమేక్
సర్దార్ గబ్బర్‌సింగ్ సెట్స్ మీద ఉండగానే పవన్ కళ్యాణ్ చేయబోయే నెక్ట్స్ సినిమా విషయంలో వార్తలు ఊపందుకున్నాయి. ఎస్ జె సూర్య డైరెక్షన్ లో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపించినా, పవన్ ఆ రిస్క్ చేయడానికి సిద్ధంగా లేడని అర్థమై పోయింది. తమిళ్లో సూపర్ హిట్ అయిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అజిత్ హీరోగా సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ ఇమేజ్‌కు తగ్గట్టు యాక్షన్, హీరోయిజం పుష్కలంగా ఉన్నాయి. అందుకే తమిళ్లో ఈ సినిమాను నిర్మించిన ఎ ఎమ్ రత్నం తెలుగులోనూ పవన్ హీరోగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్‌తో రభస సినిమాను తెరకెక్కించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడంటూ వచ్చిన వార్తలను రత్నం ఖడించాడు. పవన్ కళ్యాణ్‌తో వేదలం రీమేక్ చేస్తున్న మాట నిజమే కాని, ఆ సినిమాకు సాంకేతిక నిపుణులను, నటీనటులను ఇంత వరకు ఫైనల్ చేయలేదని తేల్చేశాడు. దీంతో ఈ సినిమా ఎవరి డైరెక్షన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. -
ఆయన తెలుగులో మళ్లీ తీయాలి!
‘‘నాన్నగారు రూపొందించిన సినిమాలకు ఏయమ్ రత్నంగారు పనిచేశారు. అప్పటినుంచి ఆయన పరిచయం. కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో మంచి విజయవంతమైన చిత్రాలు తీశారు. అజిత్‌తో ఇది మూడో సినిమా. తమిళంలో లాగే తెలుగులో కూడా ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలి’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. అజిత్, త్రిష, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఎన్నై అరిందాల్’ను ‘ఎంతవాడు గానీ...’ పేరుతో ఎ.ఎమ్.రత్నం తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకుడు. ఈ సినిమా పాటల వేడుక శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా పాటల సీడీని ప్రముఖ దర్శకుడు సురేందర్‌రెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, హీరో గోపీచంద్‌కు అందజేశారు. సురేందర్ రెడ్డి మాట్లాడుతూ -‘‘ఏయమ్ రత్నంగారు నిర్మించిన ‘జెంటిల్‌మ్యాన్’ చూసి ఆయనకు అభిమానిగా మారాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయన తెలుగులో మళ్లీ సినిమాలు తీయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఏయం రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు.