టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని | Pratani ramakrishna goud elected by TFCC new president | Sakshi
Sakshi News home page

టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా ప్రతాని

Published Mon, Aug 26 2019 12:23 AM | Last Updated on Mon, Aug 26 2019 12:23 AM

Pratani ramakrishna goud elected by TFCC new president - Sakshi

ప్రతాని రామకృష్ణ గౌడ్

‘తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. ప్రెసిడెంట్‌గా ప్రతాని రామకృష్ణ గౌడ్, ప్రధాన సలహాదారునిగా నిర్మాత ఏ.యమ్‌ రత్నం,  వైస్‌ ప్రెసిడెంట్‌గా నిర్మాత గురురాజ్, రంగా  రవీంద్ర గుప్తా,  అలీ భాయ్,  సెక్రెటరీలుగా కె.వి. రమణా  రెడ్డి,  కె .సత్యనారాయణ , ఆర్గనైజయింగ్‌ సెక్రెటరీలుగా వి. మధు, పూసల కిశోర్, రవీంద్ర గౌడ్, జాయింట్‌ సెక్రెటరీలుగా  సతీష్, నాగరాజు గౌడ్, జి. శంకర్‌ గౌడ్,  కోశాధికారిగా  రామానుజం  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

వీరితో పాటుగా ఈసీ మెంబర్స్‌గా వి. కృష్ణ రావు, హెచ్‌. కృష్ణ రెడ్డి, అలెక్స్, ఇ .సదాశివరెడ్డి, రాజు నాయక్, వెంకటేష్‌ గౌడ్, టి.  శ్రీనివాస్‌ గౌడ్, టి. రాజేష్, ఎమ్‌. వెంకటేష్, ముఖావర్‌  వలి, మహాలక్ష్మి, బి. నాగరాజు (జడ్చెర్ల ) ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం  ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’  ప్రెసిడెంట్‌ పి.రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ – ‘‘తెలంగాణ ఫిలిం ఛాంబర్‌  బిల్డింగ్‌ నిర్మాణానికి స్థలం కేటాయిస్తాం. పది ఎకరాల్లో సినీ వర్కర్స్‌ ఇళ్ల  కోసం స్థలం కేటాయిస్తాం. కల్చరల్‌ సెంటర్‌ కోసం స్థల కేటాయింపుతో పాటు 24 శాఖల్లోని వర్కర్స్‌ అందరికీ పని దొరికేలా చూస్తాం.  త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారిని కలిసి ఇవ్వన్నీ ప్రభుత్వం ద్వారా చేయాలని తీర్మానించుకున్నాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement