TFCC: నవంబర్‌ 14న టీఎఫ్‌సీసీ ఎన్నికలు | Telangana Film Chamber Of Commerce Election Will Held On November 14th | Sakshi
Sakshi News home page

TFCC: నవంబరు 14న తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు

Published Sun, Oct 24 2021 11:58 AM | Last Updated on Sun, Oct 24 2021 11:58 AM

Telangana Film Chamber Of Commerce Election Will Held On November 14th - Sakshi

‘తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ)’ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలయింది. నవంబరు 14న ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో టీ ఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘టీఎఫ్‌సీసీ స్థాపించి ఏడేళ్లు పూర్తయింది. మా చాంబర్‌లో 8000 మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 మంది తెలంగాణ మూవీ ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ ప్రస్తుత కమిటీ గడువు ముగియనుండటంతో ఎన్నికలు నిర్వహిస్తున్నాం.

నవంబరు 14నే ‘తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఆసక్తిగలవారు పోటీ చేయవచ్చు’’ అన్నారు. ‘‘టీఎఫ్‌సీసీ’ ప్రారంభమై ఏడేళ్లలో 8000 మంది సభ్యులుగా చేరడం సాధారణమైన విషయం కాదు. ‘టీఎఫ్‌సీసీ’ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాం’’ అన్నారు టీఎఫ్‌సీసీ ఉపాధ్యక్షుడు ఎత్తరి గురురాజ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement