![Telangana Film Chamber Of Commerce New Elected Body Swearing Ceremony - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/3/tfcc.jpg.webp?itok=4iPxpVMq)
ఇటీవల జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన సంగతి తెలిసిందే. చైర్మన్ గా డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్, టిఎఫ్‌సీసీ వైస్ ఛైర్మన్లు గా ఎ.గురురాజ్, నెహ్రు, సెక్రటరీగా జేవీఆర్. తెలంగాణ `మా` ప్రెసిడెంట్ గా రష్మి ఠాకూర్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రమేష్ నాయుడు తదితరులు ఎన్నికయ్యారు. కాగా ఈ రోజు టీఎఫ్‌సీసీ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, `మా` ప్రెసిడెంట్ మంచు విష్ణు అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. టీఎఫ్‌సీసీ చైర్మన్‌గా నాల్గోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణ గౌడ్‌కు శుభాకాంక్షలు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది కళాకారులకు చేయూతనిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ.. చిత్ర పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తాం’అన్నారు.
‘మా’అధ్యక్షుడు మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నేను వ్యక్తిగత హోదాలో మాత్రమే వచ్చాను. సినిమా నటులలో ఆంధ్ర, తెలంగాణ అనే భేదం లేదు. మనమందరం తెలుగు వారం. మనమంతా కలిసి తెలుగు ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను’అని అన్నారు.
వైస్ చైర్మన్లు గురురాజ్, వెంక టేశ్వరరావు, నెహ్రు, సెక్రటరీగా జేవీఆర్,జనరల్ సెక్రటరీ బి.కిషోర్ పటేల్, ఆర్గనైజర్ సెక్రెటరీ డాక్టర్ వి.రామారావు గౌడ్, టి.మా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి, జాయింట్ సెక్రటరీస్ వేణు గోపాల్ రావ్, కల్యాణి నాయుడు, రాజయ్య, జి.చెన్నారెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీస్ యమ్.అశోక్,కె.యల్. యన్.ప్రసాద్, ఈ.సి మెంబర్స్ లయన్ డి.ప్రేమ సాగర్, లయన్ సి.హెచ్.శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment