థమన్ తొలిసారి..! | Thaman to compose Music for Pawan kalyan next Film | Sakshi
Sakshi News home page

థమన్ తొలిసారి..!

Published Tue, Nov 8 2016 1:55 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

థమన్ తొలిసారి..! - Sakshi

థమన్ తొలిసారి..!

నటుడిగా ఎంట్రీ ఇచ్చి తరువాత సంగీత దర్శకుడు మంచి విజయాలు సాధిస్తున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్. అతి తక్కువ కాలంలో 50కి పైగా సినిమాలకు సంగీతం అందించిన తమన్ దాదాపు ఈ జనరేషన్ స్టార్ హీరోలందరితో కలిసి పనిచేశాడు. అయితే పవర్ స్టార్ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ మాత్రం ఈ యువ సంగీత దర్శకుడికి రాలేదు. అయితే త్వరలోనే థమన్కు ఆ కోరిక కూడా తీరనుంది.

ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్. ఈ సినిమా తరువాత ఏఎమ్ రత్నం నిర్మాణంలో తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు థమన్ సంగీత అందించనున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు థమన్. పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం అందించటం చాలా ఆనందంగా ఉందన్నాడు థమన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement