
రవి వర్మ, సంజనా సింగ్, అలోక్ జైన్, మనీషా దేవ్, జీవ ముఖ్య పాత్రల్లో చౌడప్ప దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుల్లెట్’. సోమిశెట్టి హరికృష్ణ సమర్పణలో ఎంసీ రావు, జి. గోపాల్, ఎమ్.వి మల్లికార్జునరావు, కోసూరి సుబ్రహ్మణ్యం, మణి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌లో విడుదలకానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని నిర్మాత ఏయం రత్నం విడుదల చేశారు.
చౌడప్ప మాట్లాడుతూ– ‘‘దేశానికి పట్టిన చీడ పురుగులను ఏరేసే ప్రయత్నంలో బుద్ధుడు కూడా రుద్రుడౌతాడు. ‘బుద్ధం శరణం గచ్చామి’ కాదు.. ‘యుద్ధం శరణం గచ్చామి’ అని చాటి చెప్పే సినిమా ఇది. రవి వర్మ కొత్తవాడైనా బాగా చేశాడు’’ అన్నారు. ‘‘హీరోగా నాకిది తొలి చిత్రం. ప్రేక్షకుల ఆదరణ కావాలి’’ అన్నారు రవి వర్మ.
Comments
Please login to add a commentAdd a comment