మరో తమిళ దర్శకుడితో పవన్ | Director nesan clarifies on vedalam remake with pawan kalyan | Sakshi
Sakshi News home page

మరో తమిళ దర్శకుడితో పవన్

Published Fri, May 13 2016 9:20 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

మరో తమిళ దర్శకుడితో పవన్ - Sakshi

మరో తమిళ దర్శకుడితో పవన్

సర్థార్ గబ్బర్సింగ్ రిజల్ట్తో ఆలోచనలో పడ్డ పవన్ కళ్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన ఫార్ములాను ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమాలు తమిళ దర్శకులతోనే కలిసి పనిచేశాడు. అంతేకాదు పవన్కు పవర్ స్టార్ ఇమేజ్ను కట్టబెట్టిన ఖుషి లాంటి సినిమాలు రీమేక్గా తెరకెక్కినవి. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా విషయంలో ఈ రెండు ఫార్ములాలను ఉపయోగిస్తున్నాడు పవన్.

తన ప్రతి సినిమాకు గ్యాప్ తీసుకునే పవన్, ఈ సారి మాత్రం అలాంటి ఆలోచన లేకుండా వెంటనే ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించాడు. అయితే ఈ సినిమా అజిత్ హీరోగా తమిళ్లో ఘనవిజయం సాధించిన వీరం సినిమాకు రీమేక్గా తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. సినిమా ఓపెనింగ్ సమయంలో పవన్ లుక్స్, స్టైల్ కూడా ఈ టాక్కు బలం చేకూరుస్తున్నాయి.

అయితే ఈ సినిమా తరువాత కూడా పవన్ మరో తమిళ దర్శకుడితో రీమేక్ సినిమాకే అంగీకరించాడట. అజిత్ హీరోగా తెరకెక్కిన వేదలం సినిమాను జిల్లా ఫేం నేశన్ దర్శకత్వంలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు పవర్ స్టార్. ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించనున్నాడు. ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకపోయినా.., పవన్ హీరోగా వేదలం రీమేక్కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రకటించాడు దర్శకుడు నేశన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement