పవన్కు జోడిగా నయన్ | Nayanthara to play Pawan Kalyan love interest Vedalam telugu remake | Sakshi
Sakshi News home page

పవన్కు జోడిగా నయన్

Published Fri, Oct 14 2016 1:30 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్కు జోడిగా నయన్ - Sakshi

పవన్కు జోడిగా నయన్

సర్థార్ గబ్బర్సింగ్ సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు స్పీడు పెంచాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాలో నటిస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తమిళ డైరెక్టర్ నేసన్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు.

అజిత్ హీరోగా తమిళ్లో ఘనవిజయం సాధించిన వేదలం సినిమాను పవన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే కథా కథనాలు రెడీ అయిన ఈ సినిమాను కాటమరాయుడు పూర్తయిన వెంటనే సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా పవన్ సరసన నయనతార హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే హీరోయిన్ పాత్రకు నయన్, ఓకె చెప్పిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలోనే పవన్, నయన్ల జోడిపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వస్తుందంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement