AK62: Vignesh Shivan Respond On Why He Is Removed From Ajith Movie - Sakshi
Sakshi News home page

Vignesh Shivan-Ajith: అజిత్‌ సినిమా నుంచి తప్పుకోవడంపై తొలిసారి నోరు విప్పిన నయన్‌ భర్త

Published Fri, Apr 7 2023 6:43 PM | Last Updated on Fri, Apr 7 2023 7:11 PM

AK62: Vignesh Shivan Respond On Why He Is Removed From Ajith Movie  - Sakshi

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార భర్త విఘ్నేశ్‌ శివన్‌ అజిత్‌ సినిమా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అజిత్‌ 62వ సినిమా రాబోయే ప్రాజెక్ట్‌కు ఎన్నికైన విఘ్నేశ్‌ శివన్‌ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే దీనిపై ఇంతవరకు అజిత్‌ కానీ విఘ్నేశ్‌ శివన్‌ నుంచి క్లారిటీ లేదు. నయన్‌ కూడా దీనిపై ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ తన భర్తను అవమానించినందుకు నయన్‌ హర్ట్‌ అయ్యిందని, ఇకపై అజిత్‌తో నటించనని ఆమె నిర్ణయించుకుందంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి.

చదవండి: పుష్ప 2 టీజర్‌ వచ్చేసింది.. ఇక ఫ్యా‍న్స్‌కి పూనకాలే

దీంతో ఈ విషయంలో అంతా అజిత్‌ని తప్పుబట్టారు. అజిత్‌కు స్క్రిప్ట్‌ నచ్చలేదని.. అందుకే, ఇది ఆగిపోయిందంటూ కోలీవుడ్‌ వర్గాలు చర్చించుకున్నాయి. ఈ నేపథ్యంలో అజిత్‌ సినిమా నుంచి తప్పుకోవడంపై మొదటిసారి విఘ్నేశ్‌ శివన్‌ పెదవి విప్పాడు. రీసెంట్‌గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన AK62 ప్రాజెక్ట్‌ నిలిచిపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. తన స్కిప్ట్‌ నచ్చకపోవడం వల్లే ఈ సినిమా నుంచి తనని తప్పించారన్నాడు.

చదవండి: ‘బలగం’ దూకుడు.. ఉత్తమ దర్శకుడిగా వేణుకి అంతర్జాతీయ అవార్డు

ఇందులో అజిత్‌ తప్పులేదని, తాను రాసిన స్క్రిప్ట్‌ ఆ మూవీ నిర్మాణ సంస్థకు నచ్చలేదని క్లారిటీ ఇచ్చాడు. సెకండాఫ్‌ విషయంలో వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ ప్రాజెక్ట్‌కు మగిళ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నందుకు ఆనందిస్తున్న అన్నాడు. అంతేకాదు ఒక అభిమానిగా అజిత్‌ చిత్రాన్ని ఎంజాయ్‌ చేస్తానంటూ విఘ్నేశ్‌ చెప్పుకొచ్చాడు. కాగా అజిత్‌ - విఘ్నేశ్‌ శివన్‌ కాంబోలో ఓ సినిమా చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడెక్షన్స్‌ గతేడాది ప్రకటించింది. అజిత్‌ 62వ చిత్రంగా ఇది ప్రచారం పొందింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement