Buzz Is That Nayanthara Do Not Want To Work With Ajith For Her Next Films - Sakshi
Sakshi News home page

Nayanthara : భర్తకు అవమానం.. షాకింగ్‌ నిర్ణయం తీసుకున్న నయనతార

Published Sat, Feb 11 2023 8:42 AM | Last Updated on Sat, Feb 11 2023 9:48 AM

Buzz Is That Nayanthara Do Not Want To Work With Ajith For Her Next Films - Sakshi

తమిళసినిమా: దక్షిణాది లేడీసపర్‌ స్టార్‌గా వెలిగొందిన నటి నయనతార. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తున్న ఈమె నిర్మాతగాను మారి చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షారుక్‌ఖాన్‌ సరసన నటించిన హిందీ చిత్రం జవాన్, జయంరవితో జతికట్టిన ఇరైవన్‌ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. కొత్తగా మరో రెండు చిత్రాలను అంగీకరింనట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌ను పెళ్లి చేసుకున్న నయనతార ఇటీవలే ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయిన విషయం తెలిసిందే. ఇలాంటి ఆనందకరమైన సమయంలో ఈ దంపతులకు జీర్ణించుకోలేని చేదు అనుభవం ఎదురైంది. ఇది నయనతార భర్త విషయంలో దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ నటుడు అజిత్‌ కథానాయకుడుగా చిత్రాన్ని చేయడానికి చాలా కాలంగా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం గురించి చాలానే ప్రచారం జరిగింది. అన్ని బాగుంటే ఈపాటికి చిత్రం సెట్స్‌పైకి వెళ్లేది. ఇలాంటి పరిస్థితుల్లో కథ నచ్చలేదంటూ నటుడు అజిత్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ దర్శకుడు విగ్నేశ్‌ శివన్‌ను చిత్రం నుంచి తొలగించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌కు చాలా పెద్ద అవమానమే. ముఖ్యంగా అతని భార్య నయనతారకు ఇంకా పెద్ద భంగపాటు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ వ్యవహారంలో విఘ్నేష్‌ శివన్‌ తరఫున వకాలతు పుచ్చుకున్న ఈమె అజిత్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ అధినేతలతో సామరస్య పరిష్కారం కోసం సంధి ప్రయత్నాలు చేశారు.

అయితే ఆమె ప్రయత్నం మెడిసికొట్టింది. దీంతో కోపంతో రగిలిపోయిన నయనతార మంగమ్మ శపథం లాంటిది చేసినట్లు సామాజి మాధ్యమాల్లో వైరలవుతోంది. ఇంతకీ ఆ శపథం ఏంటంటే ఎన్ని కోట్లు పారితోషికం ఇస్తానన్నా ఇకపై నటుడు అజిత్‌ సరసన నటించేదిలేదన్నదే. నిజానికి అజిత్‌ , నయనతారలది హిట్‌ కాంబినేషన్‌ అనే చెప్పాలి. ఇంతకు ముందు బిల్లా, ఆరంభం, విశ్వాసం వంటి విజయవంతమైన చిత్రాల్లో వీరు కలిసి నటించారు. ఇప్పుడు ఆమె అజిత్‌తో నటించనని తెగేసి చెప్తుందట. ఈ వార్త నయన్‌, అజిత్‌ అభిమానులను కొంత షాక్‌కి గురి చేసిందనే చెప్పాలి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement