Nayanthara To Pair Up With Ajith Kumar In Vignesh Shivan Direction Deets Inside - Sakshi
Sakshi News home page

Ajith-Nayanthara: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్ సరసన నయనతార!

Published Wed, Mar 16 2022 5:07 PM | Last Updated on Wed, Mar 16 2022 5:33 PM

Nayanthara To Pair Up With Ajith Kumar In Vignesh Shivan Direction - Sakshi

Nayanthara To Pair Up With Ajith Kumar: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ ఇటీవలె వలిమై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళనాట కాసుల వర్షం కురిపించింది. దీని తర్వాత ఆయన డైరెక్షన్‌లోనే అజిత్‌ మరో సినిమా చేయనున్నాడు. అనంతరం అజిత్‌ మరో మూవీని కూడా లైన్‌లో పెట్టేశాడు. నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఆయన ఓ సినిమాకొ ఓకే చెప్పారు. ఇందులో హీరోయిన్‌గా నయనతారని తీసుకున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇక గతంలో అజిత్, నయన్ కాంబినేషన్ లో వచ్చిన  ‘బిల్లా , ఆగన్, ఆరంభం, విశ్వాసం’ చిత్రాలు  సూపర్ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement