
‘‘హరి హర వీరమల్లు’ సినిమా అద్భుతంగా వస్తోంది. పవన్ కల్యాణ్ అభిమాఠ్నం అన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్–1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎం రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది.
కాగా ఫిబ్రవరి 4న ఏఎం రత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘పవన్ కల్యాణ్, నా కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖుషి, బంగారం’ సినిమాలు హిట్‌గా నిలిచాయి. మూడో సినిమాగా ‘హరి హర వీరమల్లు’ రూపొందుతోంది. పవన్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా మాదే. 2023లో విడుదలైన ‘బ్రో’ తర్వాత దాదాపు రెండేళ్లకు ‘హరి హర వీరమల్లు’తో పవన్ వెండితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గకుండా ఉంటుంది’’ అని తెలిపారు.