చిరు చెల్లెలుగా సాయి పల్లవి! | Sai Pallavi to sister role in the Telugu remake of Vedalam | Sakshi
Sakshi News home page

చిరు చెల్లెలు?

Published Sat, Sep 12 2020 3:08 AM | Last Updated on Sat, Sep 12 2020 8:07 AM

Sai Pallavi to sister role in the Telugu remake of Vedalam - Sakshi

హీరోయిన్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు సాయి పల్లవి. ఇలాంటి సమయంలో చెల్లెలు పాత్ర అంగీకరిస్తారా? ఆ పాత్ర చుట్టూ కథ తిరిగితే అప్పుడు అంగీకరించే అవకాశం ఉంది. తమిళ చిత్రం ‘వేదాళం’లో ఉన్న చెల్లెలు పాత్ర అలాంటిదే. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో చిరంజీవి హీరోగా నటించనున్నారు. తమిళంలో చెల్లెలి పాత్రను లక్ష్మీ మీనన్‌ చేశారు. తెలుగులో ఆ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారని సమాచారం. చిరంజీవి హీరోగా రూపొందనున్న సినిమా, పైగా పాత్ర కూడా గొప్పగానే ఉంటుంది.. ఈ రెండు కారణాలతో సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకుంటారని ఊహించవచ్చు. ఈ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement