ఎన్టీఆర్ మనసుపడ్డాడట..? | ntr expressing intrest on ajith vedalam remake | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ మనసుపడ్డాడట..?

Published Thu, Nov 19 2015 11:34 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM

ఎన్టీఆర్ మనసుపడ్డాడట..?

ఎన్టీఆర్ మనసుపడ్డాడట..?

అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా 'వేదలం'. ఇటీవల విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తొలి వారంలోనే రూ.45కోట్లకు పైగా వసూలు చేసి సౌత్ సినిమా స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. లాంగ్రన్లో వంద కోట్లు వసూలు చేయటం ఖాయంగా కనిపిస్తున్న 'వేదలం' సినిమాపై టాలీవుడ్ హీరోల కన్నుపడిందట. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాను స్పెషల్గా షో వేయించుకొని మరీ చూశాడు.

గతంలో కూడా ఎన్టీఆర్ తమిళ సినిమా రీమేక్ మీద దృష్టిపెట్టాడు. విజయ్ హీరోగా తెరకెక్కిన 'కత్తి' సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ అయినట్టే కనిపించినా, సెట్స్ మీదకు మాత్రం రాలేదు. తాజాగా 'వేదలం' సినిమా విషయంలో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్పై ఎన్టీఆర్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. 'నాన్నకు ప్రేమతో..' షూటింగ్లో ఉన్న జూనియర్ ఆ సినిమా పూర్తయ్యాక వేదలం సినిమాను ఫైనల్ చేసే అవకాశం ఉంది.

'వేదలం' సినిమాను 'ఆవేశం' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో తెలుగులో 'అఖిల్' రిలీజ్ ఉండటంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం రీమేక్ వార్తలు వస్తున్న నేపథ్యంలో డబ్బింగ్ వర్షన్ రిలీజ్పై అనుమానాలు ఏర్పాడ్డాయి. ఎన్టీఆర్తో పాటు రీ ఎంట్రీకి రెడీ అవుతున్న మెగాస్టార్ కూడా వేదలం సినిమా రీమేక్పై ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆవేశంగా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతుందా..? లేకా రీమేక్ అవుతుందా..? తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement