
పవన్ తదుపరి సినిమా ఏది..?
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ తొలిరోజు రికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. పవన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రంపై దృష్టిని కేంద్రీకరించారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా గతేడాది ఘన విజయం సాధించిన 'వెడలమ్' సినిమాను రిమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై పవన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ను పరిశీలించినట్టు పవన్ తెలిపారు. రిమేక్ చేయదలిస్తే తెలుగు సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా మార్పులు ,చేర్పులు చేయాల్పి ఉంటుందని, దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
సూపర్ హిట్ చిత్రం ఖుషీ దర్శకుడు ఎస్.జె. సూర్యతో ఓ సినిమాలో చేసే ఆలోచనలో పవన్ ఉన్నారు. తన తదుపరి చిత్రం గురించి త్వరలోనే వెల్లడిస్తానని పవన్ తెలిపారు.