అఖిల్ హీరోయిన్తో పవన్ రొమాన్స్ | Sayyeshaa has been cast opposite Pawan Kalyan | Sakshi
Sakshi News home page

అఖిల్ హీరోయిన్తో పవన్ రొమాన్స్

Published Wed, Dec 14 2016 12:26 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

అఖిల్ హీరోయిన్తో పవన్ రొమాన్స్ - Sakshi

అఖిల్ హీరోయిన్తో పవన్ రొమాన్స్

ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తరువాత చేయబోయే రెండు సినిమాలను ప్రకటించేశాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలను లాంచనంగా ప్రారంభించిన పవన్, 2019లోపు ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కాటమరాయుడు సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాతి సినిమాలకు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.

కాటమరాయుడు తరువాత తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఏఎమ్ రత్నం నిర్మించే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ వేదలంకు రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన సయేషా సైగల్ హీరోయిన్గా నటించనుందట. అక్కినేని నట వారసుడు అఖిల్ సరసన హీరోయిన్గా పరిచయం అయిన సయేషా.., తరువాత బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన శివాయ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. 19 ఏళ్ల ఈ బ్యూటి తాజాగా పవన్ సినిమాలో అవకాశం రావటంతో తెగ సంబరపడిపోతుందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement