Sayyeshaa
-
హీరో సతీమణి రీఎంట్రీ.. వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో
‘అఖిల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్ బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్‌కుమార్ ముద్దుల మనవరాలు. అజయ్‌దేవగణ్‌తో కలిసి నటించిన ‘శివాయ్’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే, వివాహం తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పంచుకుంటున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.సాయేషా సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్‌మీడియా వల్ల ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. తమిళంలో జయంరవికి జంటగా వనమగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత ఈ బ్యూటీకి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా కార్తీ, విజయ్‌సేతుపతి, సూర్య, ఆర్యతో పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో నటుడు ఆర్యతో పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అందమైన బేబీ కూడా పుట్టింది. దీంతో సాయేషా నటనకు దూరం అయింది. నటనకు దూరమైనా ఈమె సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తరచూ వారితో ముచ్చటించడం, తన ఫొటోలను పొందుపరచడం వంటివి చేస్తుంది. ఇకపోతే సాయేషాలో మంచి డాన్సర్ ఉన్నారనే విషయం తెలిసిందే. అదేవిధంగా మళ్లీ నటిగా రీఎంట్రీకి ఆసక్తి చూపుతుంది. దీంతో త్వరలోనే తన భర్త ఆర్యతో కలసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సాయేషా ఒక వీడియోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేసింది. అందులో ఆమె గురు చిత్రంలోని మైయా మైయా అనే పాటకు సూపర్‌గా స్టెప్స్ వేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సాయేషా డాన్స్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Sayyeshaa (@sayyeshaa) -
‘చినబాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : చినబాబు జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : కార్తీ, సయేషా, సత్యరాజ్, సూరి, శత్రు సంగీతం : డి ఇమాన్ దర్శకత్వం : పాండిరాజ్ నిర్మాత : సూర్య కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. తన ప్రతీ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తూ ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న కార్తీ, తాజాగా చినబాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పల్లెటూరి కథతో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను కార్తీ అన్న, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నిర్మించటం విశేషం. మరి అన్నదమ్ములు కలిసి చేసిన ఈ ప్రయత్నం ఫలించిందా..? కార్తీ తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించాడా..? కథ; పెనుగొండ రుద్రరాజు (సత్యరాజ్) రైతు. ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్న పెద్ద కుటుంబ యజమాని. ఎప్పటికైనా తన కూతుళ్లు, అల్లుల్లు.. వాళ్ల పిల్లలను ఇంటికి పిలిచి అందరితో కలిసి ఓ ఫ్యామిలీ ఫొటో తీయించుకోవాలని ఆశపడుతుంటాడు. రుద్రరాజు కొడుకు కృష్ణంరాజు (కార్తీ) ‘రైతే దేశానికి ఆధారం’ అని నమ్మే ఆదర్శ రైతు. రుద్రరాజు ఇద్దరు కూతుళ్లు తమ అమ్మాయిలను కృష్ణంరాజు కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కృష్ణంరాజు, నీల నీరధ(సయేషా)ను ఇష్టపడతాడు. (సాక్షి రివ్యూస్) దీంతో కుటుంబంలో గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో నీల నీరధ బావ, సురేంద్ర రాజు (శత్రు)ను ఓ హ్యతకేసులో కృష్ణం రాజు అరెస్ట్ చేయిస్తాడు. దీంతో ఎలాగైన ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో సురేంద్ర, రుద్రరాజు కుటుంబంలో మొదలైన గొడవలు మరింత పెద్దవి చేసి అందరిని విడదీయాలని, కృష్ణంరాజును చంపాలని ప్రయత్నిస్తాడు. ఈ సమస్యల నుంచి కృష్ణంరాజు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు..? ఎలా తిరిగి ఒక్కటి చేశాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రైతు పాత్రలో కార్తీ జీవించాడు. ఆదర్శ రైతుగా, కుటుంబం కోసం ప్రాణమిచ్చే పల్లెటూరి యువకుడి పాత్రలో కార్తీ నటన సూపర్బ్. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, యాక్షన్ ఇలా ప్రతీ విషయంలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ సయేషాది దాదాపుగా అతిథి పాత్రే. ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. గత చిత్రాల్లో మోడ్రన్ అమ్మాయిగా కనిపించిన సయేషా పల్లెటూరి అమ్మాయిగానూ మెప్పించింది. (సాక్షి రివ్యూస్) కుటుంబ పెద్దగా సత్యరాజ్ హుందాగా కనిపించారు. తెలుగులో సపోర్టింగ్ రోల్స్ లో కనిపించిన శత్రుకు ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా అవకాశం దక్కింది. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏదైన చేసే పాత్రలో శత్రు మంచి విలనిజం పండించాడు. అక్కలు, బావల పాత్రలలో నటించిన వారంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావటం కాస్త కష్టమే. విశ్లేషణ ; మాస్ ఆడియన్స్‌లో మంచి పట్టున్న కార్తీని పల్లెటూరి రైతు బిడ్డగా చూపించాడు దర్శకుడు పాండిరాజ్. మాస్ కమర్షియల్, ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా, బలమైన ఎమోషన్స్ తో కథను నడిపించాడు. కార్తీ నుంచి ఫ్యాన్స్ ఆశించిన కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలకు లోటు లేకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే సినిమా పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. నేటివిటి పరంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. (సాక్షి రివ్యూస్)నటీనటులు అంతా తమిళ వారే కావటం కూడా ఇబ్బంది పెడుతుంది. వేల్రాజ్ సినిమాటోగ్రఫి బాగుంది. పల్లె వాతావరణాన్ని అందంగా తెర మీద చూపించారు. ఇమాన్ సంగీతమందించిన పాటలు పరవాలేదనిపించినా.. ఎమోషనల్ సీన్స్‌కు నేపథ్య సంగీతం మరింత బలాన్నించింది. ఎడిటింగ్ బాగుంది. సూర్య కథ మీద నమ్మకంతో తమ్ముడి కోసం భారీగానే ఖర్చు చేసి సినిమాను నిర్మించారు. ప్లస్ పాయింట్స్ ; ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధాన పాత్రల నటన మైనస్ పాయింట్స్ ; నేటివిటి ప్రధాన పాత్రల్లో తమిళ నటులే కనిపించటం సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నాతో డైరెక్ట్‌గా మాట్లాడండి: హీరోయిన్
చెన్నై: ఏదైనా ఫేస్ టూ ఫేస్ వ్యవహారమే బెటర్ అంటోంది బాలీవుడ్ యువ హీరోయిన్ సయేషా సైగల్. బాలీవుడ్ బిగ్ సినీ వారసత్వం నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెరంగేట్రం మాత్రం టాలీవుడ్లో చేయడం విశేషం. అక్కినేని నాగార్జున వారసుడు అఖిల్ కథానాయకుడిగా పరిచయం అయిన ‘అఖిల్’ చిత్రంలో నాయకిగా పరిచయం అయిన సయేషా ఆ చిత్రంపై పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఆ తరువాత మాతృభాషలో అజయ్‌దేవ్‌గన్‌తో నటించిన శివాయ్ చిత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. దీంతో అమ్మడికి కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. తాజాగా జయం రవితో వనమగన్‌తో తమిళ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో ఒక పాటలో డ్యాన్స్ అదరగొట్టి ఆ పాటకు నృత్యదర్శకత్వం వహించిన ప్రభుదేవానే విస్మయ పరచిందట. ఇక చిత్ర దర్శకుడిని విపరీతంగా ఆకట్టుకున్న సైగల్‌కు అవకాశాలు వరుసకడుతున్నాయట. వనమగన్ చిత్ర విడుదలకు ముందే కరుప్పురాజా వెళైరాజా వంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసిన సయేషా మరి కొన్ని చిత్రాలలో నటించే విషయమై చర్చలు జరుగుతున్నాయట. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అసలు కథ ఇప్పటి నుంచే మొదలయ్యింది. సయేషా కాల్షీట్స్ ఇప్పిస్తాననీ, ఆమె మేనేజర్ తానేనంటూ కొందరు బురిడీ బాబులు పుట్టుకొచ్చారట. ఈ విషయం నటి సయేషా దృష్టికి రావడంతో వెంటనే రియాక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ తమిళం, తెలుగు చిత్రాల విషయం గానీ, ఇతర కార్యక్రమ విషయాలు ఏవైనాగానీ తనతోగానీ, తన తల్లితోగానీ డైరెక్ట్‌గా చర్చించాలనీ, అంతేగానీ తనకంటూ మేనేజర్ ఎవరూ లేరనీ ట్విటర్ ద్వారా వెల్లడించింది. -
అఖిల్ హీరోయిన్‌తో పవన్ రొమాన్స్
ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తరువాత చేయబోయే రెండు సినిమాలను ప్రకటించేశాడు. ఇప్పటికే ఈ రెండు సినిమాలను లాంచనంగా ప్రారంభించిన పవన్, 2019లోపు ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అందుకే కాటమరాయుడు సినిమా సెట్స్ మీద ఉండగానే తరువాతి సినిమాలకు నటీనటులు, సాంకేతిక నిపుణులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. కాటమరాయుడు తరువాత తమిళ దర్శకుడు నేసన్ డైరెక్షన్లో ఏఎమ్ రత్నం నిర్మించే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. తమిళ సూపర్ హిట్ మూవీ వేదలంకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన సయేషా సైగల్ హీరోయిన్గా నటించనుందట. అక్కినేని నట వారసుడు అఖిల్ సరసన హీరోయిన్గా పరిచయం అయిన సయేషా.., తరువాత బాలీవుడ్లో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన శివాయ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. 19 ఏళ్ల ఈ బ్యూటి తాజాగా పవన్ సినిమాలో అవకాశం రావటంతో తెగ సంబరపడిపోతుందట. -
'వినాయక్ చిత్రంలో చాన్స్ రావడం అదృష్టం'
చెన్నై: ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమని బాలీవుడ్ అలనాటి నటి సైరాబాను మనవరాలు సయ్యేషా సంతోషం వ్యక్తం చేశారు. వినాయక్ దర్షకత్వంలో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ హీరో సరసన నటించే చాన్స్ సయ్యేషాకు వచ్చింది. టాలీవుడ్లో సయ్యేషాకు ఇదే తొలి చిత్రం. సయ్యేషాకు బాలీవుడ్‌లోనూ అజయ్ దేవగన్ సినిమాలో అవకాశం వచ్చింది. కాగా ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లాల్సివుంది. 'కెరీర్ ఆరంభంలోనే రెండు పెద్ద ప్రాజెక్టుల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అజయ్ దేవగన్ తన డ్రీమ్ ప్రాజెక్టులోకి తనను తీసుకోవడం గొప్ప విషయం. అలాగే తెలుగులో అరంగేట్రం చిత్రంలో నటించడం ఉత్సుకతగా ఉంది. వినాయక్ బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారని విన్నా. ఆయన సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయం కానుండటం గౌరవంగా భావిస్తున్నా' అని సయ్యేషా చెప్పారు.