హీరో సతీమణి రీఎంట్రీ.. వైరల్‌ అవుతున్న డ్యాన్స్‌ వీడియో | Arya Wife Sayyeshaa Saigal Reentry | Sakshi
Sakshi News home page

హీరో సతీమణి రీఎంట్రీ.. వైరల్‌ అవుతున్న డ్యాన్స్‌ వీడియో

Published Sat, Sep 28 2024 12:44 PM | Last Updated on Sat, Sep 28 2024 12:48 PM

Arya Wife Sayyeshaa Saigal Reentry

‘అఖిల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్‌ బాలీవుడ్‌ నటదిగ్గజం దిలీప్‌కుమార్‌ ముద్దుల మనవరాలు. అజయ్‌దేవగణ్‌తో కలిసి నటించిన ‘శివాయ్‌’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే, వివాహం తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ప్లాన్‌ చేస్తుంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఆమె పంచుకుంటున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

సాయేషా సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్‌మీడియా వల్ల ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. తమిళంలో జయంరవికి జంటగా వనమగన్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత ఈ బ్యూటీకి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా కార్తీ, విజయ్‌సేతుపతి, సూర్య, ఆర్యతో పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో నటుడు ఆర్యతో పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అందమైన బేబీ కూడా పుట్టింది. దీంతో సాయేషా నటనకు దూరం అయింది. 

నటనకు దూరమైనా ఈమె సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తరచూ వారితో ముచ్చటించడం, తన ఫొటోలను పొందుపరచడం వంటివి చేస్తుంది. ఇకపోతే సాయేషాలో మంచి డాన్సర్‌ ఉన్నారనే విషయం తెలిసిందే. అదేవిధంగా మళ్లీ నటిగా రీఎంట్రీకి ఆసక్తి చూపుతుంది. దీంతో త్వరలోనే తన భర్త ఆర్యతో కలసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సాయేషా ఒక వీడియోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేసింది. అందులో ఆమె గురు చిత్రంలోని మైయా మైయా అనే పాటకు సూపర్‌గా స్టెప్స్‌ వేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో సాయేషా డాన్స్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement