Sayyeshaa Saigal
-
హీరో సతీమణి రీఎంట్రీ.. వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో
‘అఖిల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్ బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్‌కుమార్ ముద్దుల మనవరాలు. అజయ్‌దేవగణ్‌తో కలిసి నటించిన ‘శివాయ్’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే, వివాహం తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పంచుకుంటున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.సాయేషా సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్‌మీడియా వల్ల ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. తమిళంలో జయంరవికి జంటగా వనమగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత ఈ బ్యూటీకి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా కార్తీ, విజయ్‌సేతుపతి, సూర్య, ఆర్యతో పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో నటుడు ఆర్యతో పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అందమైన బేబీ కూడా పుట్టింది. దీంతో సాయేషా నటనకు దూరం అయింది. నటనకు దూరమైనా ఈమె సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తరచూ వారితో ముచ్చటించడం, తన ఫొటోలను పొందుపరచడం వంటివి చేస్తుంది. ఇకపోతే సాయేషాలో మంచి డాన్సర్ ఉన్నారనే విషయం తెలిసిందే. అదేవిధంగా మళ్లీ నటిగా రీఎంట్రీకి ఆసక్తి చూపుతుంది. దీంతో త్వరలోనే తన భర్త ఆర్యతో కలసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సాయేషా ఒక వీడియోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేసింది. అందులో ఆమె గురు చిత్రంలోని మైయా మైయా అనే పాటకు సూపర్‌గా స్టెప్స్ వేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సాయేషా డాన్స్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Sayyeshaa (@sayyeshaa) -
తెలుగులో తొలి సినిమా.. తమిళ హీరోతో పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరంటే? (ఫొటోలు)
-
మళ్లీ నటించడానికి సిద్ధం!
బాలీవుడ్ లెజెండ్రీ దిలీప్‌కుమార్ కుటుంబానికి చెందిన నటి సాయేషాసైగల్. టాలీవుడ్ యువ నటుడు అఖిల్ కథానాయకుడిగా నటించిన అఖిల్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన నటి సాయేషా సైగల్. ఆ తర్వాత అజయ్‌దేవగన్ సరసన శివాయ్ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా జయంరవికి జంటగా వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఈ చిత్రంతో నటిగానే కాకుండా తనలో మంచి డాన్సర్ ఉన్నట్లు నిరూపించుకున్నారు. ఆ తర్వాత తమిళంలో కార్తీ సరసన కడైకుట్టి సింగం, విజయ్‌సేతుపతితో జూంగా, ఆర్యకు జంటగా గజినీకాంత్, రెడీ, సూర్య సరసన కాప్పాన్ చిత్రాల్లో కథానాయకిగా నటించారు. అలాంటి సమయంలో ఆర్యను ప్రేమించి పెద్దల అనుమతితో 2019లో పెళ్లిచేసుకున్నారు. దీంతో నటనకు చిన్నగ్యాప్ ఇచ్చారు. ఈ సినీజంటకు హర్యానా అనే కూతురు పుట్టింది. కాగా చిన్నగ్యాప్ తర్వాత సాయేషా శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలో ఒక సింగిల్‌సాంగ్‌లో మెరిశారు. ప్రస్తుతం మళ్లీ నటించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. పలు కథలు వింటున్నారని సమాచారం. దీంతో సాయేషా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో ఆనందాన్ని ఇస్తోంది. దీంతో త్వరలోనే సాయేషాసైగల్ రీఎంట్రీ షురూ అవుతుందని భావించవచ్చు. అయితే ఆమె తాజాగా ఏ నటుడి సరసన నటిస్తారన్నదే ఆసక్తిగా మారింది. -
కూతురితో ఆడుకున్న ఆర్య దంపతులు
-
ఐటమ్ సాంగ్స్ కోసం భారీ పారితోషికం తీసుకొన్న సాయేషా ఆర్య!
సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఐటమ్ సాంగ్స్ చిత్రాలకు క్రేజ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల పుష్ప చిత్రంలో ఊ అంటావా మావ ఊహూ అంటావా మావ పాట ఎంతో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ పాటలో నటించేందుకు నటి సమంత భారీ పారితోషికం పుచ్చుకుందన్న ప్రచారం జరిగింది. అలాంటి ఐటమ్ సాంగ్స్‌లో నటించే స్టార్ హీరోయిన్లకు అంత డిమాండ్ ఉంటుంది మరి. తాజాగా నటి సాయేషా ఆర్య కూడా ఐటెమ్ సాంగ్‌కు భారీ పారితోషికం అందుకున్నట్లు తెలిసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ నటుడు ఆర్యన్‌ను పెళ్లి చేసుకున్న తరువాత కోలీవుడ్‌కు దూరమయ్యారు. తమిళంలో ఈమె నటించిన చివరి చిత్రం కాప్పాన్. కాగా తాజాగా పత్తుతల చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌లో మెరవనున్నారు. నటుడు శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం పత్తుతల. గౌతమ్ కార్తీక్, నటి ప్రియా భవానీ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు తెరపైకి రానుంది. ఇందులో ఐటమ్ సాంగ్‌లో నటించడానికి నటి సాయేషా ఆర్య రూ.40 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇది ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. -
పెళ్లి చేసుకుంటానని మోసం: పోలీసుల ఎదుటకు హీరో ఆర్య
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ప్రముఖ నటుడు ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేస్తూనే ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషా సైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. -
పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
కోలీవుడ్ హీరో ఆర్య భార్య, హీరోయిన సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. తాను మావయ్య అయ్యానని, చాలా ఎమోషనల్‌గా ఉందని చెబుతూ విశాల్ ఆర్య, సయేషాలకు అభినందనలు తెలిపారు. ‘ఈ వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి' అంటూ విశాల్ ట్వీట్ చేశాడు. కాగా, ఆర్య, విశాల్ కలిసి ప్రస్తుతం ‘ఎనిమీ’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్‌లో జరుగుతుంది. ఆర్య, సయేషా సైగల్‌లది ప్రేమ వివాహం. ‘అఖిల్' అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా.. ఆ తర్వాత ‘గజినీకాంత్' అనే మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే ఆర్యతో ప్రేమాయణం సాగించింది. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. -
ముచ్చటైన జంట ఆర్య, సాయేషా ఫోటోలు
-
నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను!
చెన్నై : నువ్వు లేని జీవితాన్ని కలలో కూడా ఊహించుకోలేను అని నటి సాయేషా సైగల్ పేర్కొంది. ఈ అమ్మడు ఎవరి గురించి ఇలా చెప్పిందో ఊహించవచ్చు. ఎస్ తన భర్త ఆర్య గురించే అలా తన భావాన్ని వెల్లడించింది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత తెలుగులో అఖిల్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత, తమిళంలోకి దిగుమతి అయిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి సాయేషా. ఆ తరువాత నటుడు ఆర్యతో కలిసి గజనీకాంత్ చిత్రంలో జత కట్టింది. ఆ చిత్రమే వారిద్దరిని నిజ జీవితంలో ఆలుమగలను చేసింది. అవును గజనీకాంత్ చిత్రంతో పరిచయం ఆర్య, సాయేషాసైగల్ల మధ్య ప్రేమకు దారి తీయడం,ఆ వెంటనే ఇరుకుటుంబాల సమ్మతంతో పెళ్లి చేసుకోవడం చాలా సైలెంట్‌గా జరిగిపోయాయి. 2019, మార్చి 10 తేదీ ఈ జంట నిజజీవితంలో ఒకటైన రోజు అంటే మంగళవారానికి సరిగ్గా వివాహ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కాగా ఈ సందర్భంగా ఆర్య, సాయేషా తాజాగా కలిసి నటిస్తున్న టెడీ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.ఇదో విశేషం అయితే తొలి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్య గురించి సాయేషా తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. అందులో నన్ను అన్ని విధాలుగా సంపూర్ణం చేసిన మనిషికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను. ప్రేమ,ఉత్సాహం, స్థిరత్వం, స్నేహం అన్నీ ఒకేసారి లభించాయి. నేను నిన్ను ఇప్పటికీ, ఎప్పటికీ ఇష్టపడతాను అని పేర్కొంది.అందుకు నటుడు ఆర్య బదులిస్తూ ఎప్పటికీ అన్నది భవిష్యత్ కాలం. అయితే దాన్ని నీతో గడపడానికి ఎలాంటి సంకోచంలేదు. నేను నేనుగా ఉండడానికి కారణం నువ్వే. నేను నిన్ను ఎంతగానే ప్రేమిస్తున్నాను. నువ్వు నువ్వుగా ఉండడానికి ధన్యవాదాలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఆర్య పేర్కొన్నారు. వీరు ఒకరికొకరుఇలా ప్రేమ నిండిన మనసుతో శుభాకాంక్షలు తెలుపుకున్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
‘నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించలేను’
తమిళ నటుడు ఆర్య, నటి సయేషా సైగల్ ప్రేమ వివాహం చేసుకొని ఈ రోజుతో ఏడాది పూర్తి అవుతోంది. కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట గతేడాది మార్చి 10న వివాహ బంధంతో ఒకటయ్యారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ క్యూట్ కపూల్కి సెలబ్రిటీలు, అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ శుభ సందర్భంగా సాయేషా, ఆర్య ఇద్దరూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇద్దరు కలిసి ప్రేమగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ('ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా') ఈ మేరకు.. ‘నా జీవితాన్ని పరిపూర్ణం చేసిన వ్యక్తికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేకుండా నా జీవితాన్ని అస్సలు ఊహించలేను జాన్. అన్ని వేళలా నువ్వు చూపే ప్రేమ అమూల్యమైనది. ఇప్పుడు.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. బెస్ట్ హస్బెండ్’ అంటూ ఆర్య మీద ఉన్న ప్రేమను సయేషా సైగల్ తెలియ జేశారు. అలాగే ఆర్య ‘ఎల్లకాలం అనే పదం చాలా పెద్దది. కానీ నేను నీతో ఉన్నప్పుడు సమయమే గుర్తురాదు. నీవల్ల నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నాను. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. లవ్ యూ సోమచ్ మై జాన్. హ్యాపీ యానివర్సరీ’ అంటూ భార్యకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన సాయేషా.. ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనువరాలు. గజినీకాంత్ చిత్రంలో కలిసి నటించిన ఆర్య, సయేషా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి గతేడాది పెళ్లి పీటలెక్కారు. ఆర్య ప్రస్తుతం ‘టెడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషా సైగల్నే హీరోయిన్గా నటించడం విశేషం. ఈ రోజే సినిమా టీజర్ విడుదలవ్వడం మరో విశేషం. Happy Anniversary to the man who completes me in every way possible! Life without you is unimaginable jaan. Love, excitement, stability and companionship all at the same time! I love you now and forever! ❤️😘😍#besthusband @arya_offl pic.twitter.com/MPUx5HJ3JU — Sayyeshaa (@sayyeshaa) March 10, 2020 Forever is a long time but I don’t mind spending it with you 😉😉🤗🤗😍😘😘🤩🤩 I am more of me because of you .. love u so much my jaan 🤗🤗😘 thanks for being you .. Happy Anniversary 🤗🤗😘😘 https://t.co/Je0LkI5f4k — Arya (@arya_offl) March 10, 2020 -
వివాహానంతరం నటించాలా వద్దా అనేది సాయేషాకే..
పెరంబూరు: నటి సాయేషా సైగల్ తనకు భార్య కావడం సంతోషంగా ఉందని నటుడు ఆర్య పేర్కొన్నారు. కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన ఈయన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్తో కలిసి గజనీకాంత్ చిత్రంలో నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ తొలకరించడంతో పెళ్లికి దారి తీసింది. ఇరుకుటుంబాల అనుమతితో గత 9వ తేదీన సంగీత్, 10వ తేదీన పెళ్లి హైదరాబాద్ వేదికగా వేడుకగా జరుపుకున్నారు. కాగా గురువారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు విజయ్, నటుడు భరత్, శాంతను పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నవ వధూవరులకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా నటి సాయేషాను వివాహమాడడం గురించి ఆర్య తన భావాన్ని వ్యక్తం చేస్తూ సాయేషాను భార్యగా పొందడం సంతోషంగా ఉందన్నారు. గజనీకాంత్ చిత్రంలో నటిస్తున్నప్పుడే చిన్న ఆకర్షణ కలిగిందని, ఆ తరువాత స్నేహితులుగా మారామని చెప్పారు. అయితే కాప్పాన్ చిత్రంలో నటిస్తున్న సమయంలో తమ మధ్య స్నేహాన్ని గ్రహించిన ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి నిశ్చింయించారని చెప్పారు. చాలా కాలంగా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని, వారి కోరికను నెరవేర్చేవిధంగానూ, వారికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వివాహానంతరం నటించాలా వద్దా అన్న నిర్ణయాన్ని సాయేషాకే వదిలేసినట్లు ఆర్య తెలిపారు. కాగా వివాహానంతరం ఈ జంట టెడ్ అనే చిత్రంలో నటించబోతున్నారన్నది తాజా సమాచారం. -
ఆ హీరో.. హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారా!
మరో రీల్ పెయిర్.. రియల్ పెయిర్‌గా మారేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘అఖిల్’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన సయేషా సైగల్, తరువాత కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గజనీకాంత్ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో ఆర్యను సయేషా పెళ్లాడనుందట. ఆర్య, సయేషాలు ప్రేమలో ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఆర్యగానీ, సయేషాగానీ ఇంతవరకు స్పందించలేదు. తాజాగా మార్చి 10న వీరి వివాహం అంటూ కోలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఇప్పటికైన ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సయేషా, సూర్య హీరోగా తెరకెక్కుతున్న కాప్పాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్య కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. -
ఆయనతో నటించడం చాలా కూల్..
ఆయనతో నటించడం చాలా కూల్ అంటోంది నటి సాయేషా సైగల్. వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీకి ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోయినా, అవకాశాలకు మాత్రం ఆ చిత్రమే కారణం అంటుంది. జయంరవికి జంటగా నటించిన వనమగన్ చిత్రంలో సాయేషా నటన, ముఖ్యంగా ఆమె డాన్స్ పలువురిని ఆకర్షించింది. తాజాగా ఆర్యకు జంటగా గజనికాంత్ చిత్రంలో నటిస్తోంది. ఇంతకు ముందు హరహర మహేదేవకి చిత్రంలో దర్శకుడిగా పరిచయమైన పి.విజయకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టూడియోగ్రీన్ అధినేత కేఈ. జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రాల్లో ఇది ఒకటి. సాధారణంగా ఆర్యతో నటించే హీరోయిన్లు ఆయన గురించి కాస్త ఎక్కువగానే చెబుతుంటారు. వారిని ఏం మాయ చేస్తారోగానీ, హీరోయిన్ల హీరోగా పేరు తెచ్చుకున్నారు. చాలా మంది హీరోయిన్లకు నచ్చే ఆర్య సాయేషాకు తెగ నచ్చేశారట. ఇటీవల జరిగిన చిత్ర విలేకరుల సమావేశంలో ఈ భామ ఆర్యతో నటించడం చాలా కూల్ అంటూ కితాబిచ్చేసింది. అంతే కాదు గజనికాంత్ లాంటి చిత్రాల్లో నటించడం జాలీ అని చెప్పింది. వనమగన్ చిత్రంలో తన నటనను చూసే జ్ఞానవేల్‌రాజా తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించారని తెలిపింది. తన కేరీర్లో గజనీకాంత్ మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెప్పింది. ఇక ఆర్య కూడా సాయేషాపై పొగడ్తల వర్షం కుపించారు. సాయేషాసైగల్ డాన్స్ చూసి భయపడిపోయానని, ఆమెతో డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డానని ఆర్య చెప్పారు. ఈ చిత్రం తరువాత సాయేషా కార్తీతో కడైకుట్టి సింగం చిత్రంలో నటిస్తోంది. మొత్తం మీద ఈ ఉత్తరాది బ్యూటీ కోలీవుడ్‌లో వరుసగా అవకాశాలను బాగానే రాబట్టుకుంటోంది. -
'బాలీవుడ్ ఫైట్స్ బోర్ కొడుతున్నాయి'
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ నెలాఖరున రిలీజ్‌కు రెడీ అవుతున్న శివాయ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న అజయ్, తనకు బాలీవుడ్ యాక్షన్ సీన్స్ బోర్ కొడుతున్నాయంటూ కామెంట్ చేశాడు. ఫైట్ మాస్టర్ వీర్ దేవగన్ వారసుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్, యాక్షన్ సీన్స్‌పై చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న శివాయ్ సినిమాలో హీరోగా నటిస్తున్న అజయ్ ఆ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సందర్భంగా బాలీవుడ్ యాక్షన్ సీన్స్ బోర్ కొట్టాయన్న అజయ్ దేవగన్, తన సినిమాతో కొత్త తరహా యాక్షన్‌ను ట్రై చేశానని ప్రకటించాడు. 2008లో తెరకెక్కిన 'యు మీ ఔర్ హమ్' సినిమాతో మెగాఫోన్ పట్టిన అజయ్, రెండో ప్రయత్నంగా శివాయ్ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఐదేళ్ల క్రితమే ఈ సినిమాను రూపొందించేందుకు ప్రయత్నాలు చేసినా.. అప్పట్లో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కారణంగా వాయిదా వేసినట్టుగా తెలిపారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాతో అఖిల్ ఫేం సయేషా సైగల్ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. -
'ఫస్ట్ లుక్ అదిరింది.. ఆల్ ది బెస్ట్'
అఖిల్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సాయేషా సైగల్. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది. బాలీవుడ్ మూవీ 'శివాయ్'తో స్టార్ హీరో అజయ్ దేవగణ్ కు జత కట్టింది. శివాయ్ లో సాయేషా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మూవీ హిట్ అవ్వాలని, తనను ఆశీర్వదించాలని కోరుతూ సాయేషా ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు స్పందించిన టాలీవుడ్ హీరో నితిన్.. ఫస్ట్ లుక్ అదిరింది, ఆల్ ద బెస్ట్ ఫర్ మూవీ అంటూ రీట్విట్ చేశాడు. థ్యాంక్యూ నితిన్, ఎప్పటికీ నువ్వే నా తొలి నిర్మాతవు అని మరో ట్వీట్ తో బదులిచ్చింది. ఎప్పటికీ నీ ప్రేమ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నట్లు సాయేషా రాసుకొచ్చింది. అఖిల్ మూవీకి నితిన్ నిర్మాత అన్న విషయం తెలిసిందే. మరోవైపు శివాయ్ మూవీకి అజయ్ దేవగణ్ అన్నీ తానై పనుల్లో బిజీబిజీగా ఉన్నాడు. శివాయ్ కి దర్శకుడిగా, సహ నిర్మాతగానూ అజయ్ వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవలే మూవీ యూనిట్ ప్రకటించింది. @sayyeshaa Nice 1st look..good luck for the film