ఆ హీరో.. హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతున్నారా! | Sayyeshaa Saigal to Tie the Knot With Hero Arya | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 31 2019 2:13 PM | Last Updated on Thu, Jan 31 2019 2:14 PM

Sayyeshaa Saigal to Tie the Knot With Hero Arya - Sakshi

మరో రీల్‌ పెయిర్‌.. రియల్‌ పెయిర్‌గా మారేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘అఖిల్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన సయేషా సైగల్‌, తరువాత కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గజనీకాంత్ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో ఆర్యను సయేషా పెళ్లాడనుందట.

ఆర్య, సయేషాలు ప్రేమలో ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఆర్యగానీ, సయేషాగానీ ఇంతవరకు స్పందించలేదు. తాజాగా మార్చి 10న వీరి వివాహం అంటూ కోలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఇప్పటికైన ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సయేషా, సూర్య హీరోగా తెరకెక్కుతున్న కాప్పాన్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్య కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement