
బాలీవుడ్ లెజెండ్రీ దిలీప్‌కుమార్ కుటుంబానికి చెందిన నటి సాయేషాసైగల్. టాలీవుడ్ యువ నటుడు అఖిల్ కథానాయకుడిగా నటించిన అఖిల్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన నటి సాయేషా సైగల్. ఆ తర్వాత అజయ్‌దేవగన్ సరసన శివాయ్ చిత్రంతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. అదేవిధంగా జయంరవికి జంటగా వనమగన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. ఈ చిత్రంతో నటిగానే కాకుండా తనలో మంచి డాన్సర్ ఉన్నట్లు నిరూపించుకున్నారు.
ఆ తర్వాత తమిళంలో కార్తీ సరసన కడైకుట్టి సింగం, విజయ్‌సేతుపతితో జూంగా, ఆర్యకు జంటగా గజినీకాంత్, రెడీ, సూర్య సరసన కాప్పాన్ చిత్రాల్లో కథానాయకిగా నటించారు. అలాంటి సమయంలో ఆర్యను ప్రేమించి పెద్దల అనుమతితో 2019లో పెళ్లిచేసుకున్నారు. దీంతో నటనకు చిన్నగ్యాప్ ఇచ్చారు. ఈ సినీజంటకు హర్యానా అనే కూతురు పుట్టింది.
కాగా చిన్నగ్యాప్ తర్వాత సాయేషా శింబు కథానాయకుడిగా నటించిన పత్తుతల చిత్రంలో ఒక సింగిల్‌సాంగ్‌లో మెరిశారు. ప్రస్తుతం మళ్లీ నటించడానికి సిద్ధమైనట్లు తెలిసింది. పలు కథలు వింటున్నారని సమాచారం. దీంతో సాయేషా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారన్న వార్త ఆమె అభిమానుల్లో ఆనందాన్ని ఇస్తోంది. దీంతో త్వరలోనే సాయేషాసైగల్ రీఎంట్రీ షురూ అవుతుందని భావించవచ్చు. అయితే ఆమె తాజాగా ఏ నటుడి సరసన నటిస్తారన్నదే ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment