
సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఐటమ్ సాంగ్స్ చిత్రాలకు క్రేజ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల పుష్ప చిత్రంలో ఊ అంటావా మావ ఊహూ అంటావా మావ పాట ఎంతో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ పాటలో నటించేందుకు నటి సమంత భారీ పారితోషికం పుచ్చుకుందన్న ప్రచారం జరిగింది. అలాంటి ఐటమ్ సాంగ్స్‌లో నటించే స్టార్ హీరోయిన్లకు అంత డిమాండ్ ఉంటుంది మరి. తాజాగా నటి సాయేషా ఆర్య కూడా ఐటెమ్ సాంగ్‌కు భారీ పారితోషికం అందుకున్నట్లు తెలిసింది.
ఈ బాలీవుడ్ బ్యూటీ నటుడు ఆర్యన్‌ను పెళ్లి చేసుకున్న తరువాత కోలీవుడ్‌కు దూరమయ్యారు. తమిళంలో ఈమె నటించిన చివరి చిత్రం కాప్పాన్. కాగా తాజాగా పత్తుతల చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్‌లో మెరవనున్నారు. నటుడు శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం పత్తుతల. గౌతమ్ కార్తీక్, నటి ప్రియా భవానీ శంకర్ తదితరులు ప్రధాన పాత్రలు ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని రేపు తెరపైకి రానుంది. ఇందులో ఐటమ్ సాంగ్‌లో నటించడానికి నటి సాయేషా ఆర్య రూ.40 లక్షలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఇది ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment