'వినాయక్ చిత్రంలో చాన్స్ రావడం అదృష్టం' | Fortunate to be launched by V.V Vinayak: Sayyeshaa | Sakshi
Sakshi News home page

'వినాయక్ చిత్రంలో చాన్స్ రావడం అదృష్టం'

Published Wed, Jul 22 2015 4:18 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

'వినాయక్ చిత్రంలో చాన్స్ రావడం అదృష్టం'

'వినాయక్ చిత్రంలో చాన్స్ రావడం అదృష్టం'

చెన్నై: ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చిత్రంలో నటించే అవకాశం రావడం అదృష్టమని బాలీవుడ్ అలనాటి నటి సైరాబాను మనవరాలు సయ్యేషా సంతోషం వ్యక్తం చేశారు. వినాయక్ దర్షకత్వంలో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ హీరో సరసన నటించే చాన్స్ సయ్యేషాకు వచ్చింది. టాలీవుడ్లో సయ్యేషాకు ఇదే తొలి చిత్రం. సయ్యేషాకు బాలీవుడ్లోనూ అజయ్ దేవగన్ సినిమాలో అవకాశం వచ్చింది. కాగా ఈ చిత్రం ఇంకా సెట్స్పైకి వెళ్లాల్సివుంది.

'కెరీర్ ఆరంభంలోనే రెండు పెద్ద ప్రాజెక్టుల్లో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అజయ్ దేవగన్ తన డ్రీమ్ ప్రాజెక్టులోకి తనను తీసుకోవడం గొప్ప విషయం. అలాగే తెలుగులో అరంగేట్రం చిత్రంలో నటించడం ఉత్సుకతగా ఉంది. వినాయక్ బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారని విన్నా. ఆయన సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయం కానుండటం గౌరవంగా భావిస్తున్నా' అని సయ్యేషా చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement