'వేదలం' రీమేక్ లో పవన్! | PK gives the nod to star in Telugu remake of Vedalam! | Sakshi
Sakshi News home page

'వేదలం' రీమేక్ లో పవన్!

Published Mon, Feb 1 2016 9:18 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఎస్ జె సూర్యతో పవన్ కల్యాణ్‌(ఫైల్) - Sakshi

ఎస్ జె సూర్యతో పవన్ కల్యాణ్‌(ఫైల్)

అజిత్ హీరోగా తమిళంలో ఘన విజయం సాధించిన 'వేదలం' సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయి. నందమూరి హీరోలు నటించే అవకాశముందని ఇప్పటివరకు ఊహాగానాలు విన్పించాయి. అయితే మరో టాప్ హీరో పేరు తెరపైకి వచ్చింది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ సినిమాకు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది. 'ఖుషి'తో తనకు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో 'వేదలం' రీమేక్ చేసేందుకు పవన్ అంగీకరించారని సినీవర్గాల సమాచారం. 'చాలా స్టోరీ లైన్లు అనుకున్నా వర్కవుట్ కాలేదు. వేదలం కథ పవన్ కు బాగా కుదురుతుందని భావించారు. సిస్టర్ సెంటిమెంట్తో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ రెవేంజ్ స్టోరీని తెలుగులోనూ తెరకెక్కించాలని నిర్ణయించార'ని సినీ వర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ మొదలైందని తెలుస్తోంది. ఇందులో భాగంగా దర్శకుడు ఎస్ జే సూర్య పలుమార్లు 'సర్దార్ గబ్బర్ సింగ్' సెట్ వచ్చారట. 'వేదలం' సినిమా నిర్మాత కూడా ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసారని సమాచారం. 'వేదలం' సినిమా రీమేక్ లో జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ నటించే అవకాశముందని అంతకుముందు ఊహాగానాలు వచ్చాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement